క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మిత్రుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ వివాదాలకు మారుపేరు. గతంలో ఏకంగా సచిన్ పైనే విమర్శలు చేసిన కాంబ్లీ పలు సందర్భాల్లో తోటి క్రికెటర్ల తో రచ్చ చేశాడు. తాజాగా కాంబ్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో పడ్డాడు. కాంబ్లీ ఇంట్లో తన ఇంట్లో పనిచేసే పనిమనిషిపై దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.
జీతం అడిగినందుకు తనపై వినోద్ కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియా దాడి చేశారని పని మనిషి ఫిర్యాదు చేసింది. మూడు రోజుల పాటు తనను చీకటి గదిలో బందించారని వాపోయింది. మళ్లీ తమ ఇంటి పరిసరాల్లో కనిపించవద్దని హెచ్చరిస్తూ... విడిచిపెట్టారని ఆమె తెలిపింది. రెండేళ్లుగా తనకు జీతం ఇవ్వడం లేదని, తాను కాంబ్లీ ఇంట్లోనే పనిచేస్తూ అక్కడే వాళ్లింట్లోనూ ఉంటున్నట్లు పేర్కొంది.
పనిమనిషి ఫిర్యాదుతో పోలీసులు కాంబ్లీ సహా ఆయన భార్యపై కేసు నమోదు చేశారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము కాంబ్లీని విచారిస్తామని పోలీసులు తెలిపారు.