కోదండరామ్ కు చేరువలో ముద్రగడ

Update: 2016-02-03 09:34 GMT
ఆకాంక్షల ఆధారంగా జరిగే ఉద్యమాలు సరైన మార్గదర్శకంతో, ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే…లక్ష్యంతో పాటు వ్యూహం కూడా ముఖ్యం. తాజాగా కాపుల ఉద్యమం విషయంలో ఇదే అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీసీల్లో కాపులను చేర్చాలనే నినాదంతో సాగిన ఈ సభ అనంతరం పక్కదారి పట్టింది. పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవటం... రైలురోకోలో రత్నాచల్‌ రైలును దగ్థం చేయటం జరిగాయి. ఇదే క్రమంలో స్థానికంగా ఉన్న తునిలోని రెండు పోలీస్‌ స్టేషన్ల మీద దాడి జరిగింది. 15కు పైగా ప్రభుత్వ వాహనాల దగ్థమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి, రాస్తారోకోతో స్తంభించిన ట్రాఫిక్ వంటివి పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి.

పెద్ద ఎత్తున జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ కేసుల నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది. కాపు గర్జన విషయంలో క్రియాశీలంగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభంను మొదటి నిందితుడిగా పేర్కొంటూ పలు కేసులు నమోదయ్యాయి. రత్నాచల్‌ రైలు దగ్దం కేసులో కూడా ఆయన్ను ఏ1గా చేర్చినట్లు సమాచారం. దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులను దగ్ధంలో నమోదయిన కేసుల లెక్క తేలితే....ముద్రగడపై ఏకంగా 73 కేసులు నమోదయినట్లు సమాచారం.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ జేఏసీ సారథి ప్రొఫెసర్ కోదండరాం రీతిలోనే ముద్రగడపై కేసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నట్లు పలు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే కోదండరాం లాగానే ముద్రగడ శాంతియుత రీతిలో కాపుల డిమాండ్ ను ముందుకుతీసుకుపోవాల్సిందని చెప్తున్నారు.
Tags:    

Similar News