తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం, 2020 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 12 శాతం నేరాలు పెరిగాయి. రాష్ట్రంలో గతేడాది మహిళపై లైంగిక వేదింపులకు సంబంధించి 4,907 కేసులు నమోదు అయ్యాయి. ఇలా మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దోపిడీలు, వంటి కేసులు భారీగా నమోదు అయ్యాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా నమోదైన వివరాలని ఒకసారి చూస్తే తెలంగాణలో నేరాల సంఖ్య ఏపీ స్థాయిలో పెరగలేదు. 2019లో తెలంగాణలో మొత్తం నమోదైన నేరాల సంఖ్య 1,31, 254 కాగా 2020లో ఈ సంఖ్య 1, 47,504. ఏపీతో పోలిస్తే శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లుగానే చెప్పుకోవాలి. సైబర్ నేరాలు తెలంగాణలో అతి వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలు 2019లో 2,691గా ఉంటే 2020కి వచ్చేసరికి ఏకంగా 5,024కు చేరుకున్నాయి. సైబర్ నేరాల నమోదులో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది మనుషుల అక్రమ రవాణా విషయంలో తెలంగాణలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో 104 నమోదయ్యాయి. మహారాష్ట్రలో 154కేసులు నమోదయ్యాయి.
వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు, వాటిపై విచారణలు, శిక్షలు పడుతున్న విషయంపైనా జాతీయ నేర గణాంక సంస్థ రికార్డులు విడుదల చేసింది. 2020కి నమోదైన శిక్షల్లో ఖరారు శాతం 25.6శాతంగా నమోదైంది. మిగతా కేసులన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి. అత్యధిక కేసులు పెండింగ్‌లో ఉండిపోవడం వల్ల నేరస్తులకు శిక్షలు పడటంలేదు. ఈ కారణంగా నేరగాళ్లకు ధైర్యం పెరుగుతోందన్న విశ్లేషణలు చాలా కాలంగా న్యాయనిపుణులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
నేషనల్ క్రైం రికా ర్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)-2020 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019తో పోలిస్తే సైబర్‌నేరాలు 2020లో 11.8 శాతం పెరిగాయని పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదలచేసిన ఈ నివేదిక ప్రకారం 2019లో 44,735 నమోదు కాగా, 2020లో 50,035 నమోదయ్యాయి. 60.2% సైబర్ మోసాలకు సంబంధించిన కేసులే ఉన్నాయి. రెండోస్థానంలో లైంగిక వేధింపులు (6.6%), మరో 2,440 కేసులో బెదిరింపులకు సం బంధించినవి ఉన్నాయి.
మానవ అక్రమ రవాణాకేసులు 2019తో పోలిస్తే 22% తగ్గుదల నమోదైంది. 2019లో మానవ అక్రమ రవాణా కేసులు 2,208 కేసులు నమోదు కాగా, 2020లో 1,714 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 66,01,285 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ సెక్షన్ల కింద 42,54,356 కేసులు, ఇతర సెక్షన్ల కింద 23,46,929 కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020లో నేరాల నమోదు శాతంలో 28 శాతం పెరుగుదల కనిపిస్తున్నది.