ఆ యువ‌త‌ ఆశ‌లు ఆవిరి.. 14 సెక్ష‌న్ల కింద కేసులు

Update: 2022-06-18 11:30 GMT
తెలంగాణ‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో నిర‌స‌న వ్య‌క్తం చేసిన యువ‌త‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. విధ్వంసంలో పాల్గొన్న‌వారిని రెండు సెక్ష‌న్లుగా విభ‌జించింది. రైళ్లు త‌గ‌ల‌బెట్ట‌డం.. అధికారుల‌పై దాడులు చేయ‌డం.. వంటివారిపై 14 సెక్ష‌న్లు స‌హా.. సంఘ విద్రోహ శ‌క్తుల‌పై న‌మోదు చేసే కేసులు న‌మోదు చేయాల‌ని రైల్వే శాఖ‌ను ఆదేశించింది. అదేవిధంగా అత్యంత దారుణ‌మైన ఇండియ‌న్ రైల్వే యాక్ట్‌లోని సెక్ష‌న్ 150 కింద కేసులు పెట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఇక‌, నిర‌స‌న‌లో పాల్గొని ఎలాంటి విధ్వంసాల‌కు తెగ‌బ‌డ‌ని వారిపై కూడా కేసులు పెట్టాల‌ని కేంద్రం ఆదేశిం చింది. ఈ మేర‌కు కేంద్ర రైల్వే శాఖ నుంచి సికింద్రాబాద్ రైల్వే అధికారుల‌కు ఆదేశాలు చేరాయి. సీసీటీవీ ఫుటేజ్‌ల‌తోపాటు.. వివిధ చానెళ్ల‌లో వ‌చ్చిన వార్త‌లు.. ప్ర‌సార‌మైన క‌థ‌నాలు వంటివి ప్రామాణికంగా తీసుకుని.. నిర‌స‌న కారుల‌ను గుర్తించాల‌ని.. రైల్వే శాఖ సూచించింది. వీరిపై త‌క్ష‌ణ‌మేకేసులు న‌మోదు చేసి.. అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

మ‌రోవైపు.. ఇండియ‌న్ ఆర్మీ కూడా.. వీరిని త‌మ విభాగంలోకి తీసుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే కేసులు న‌మోదైన‌.. యువ‌త‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌రు.

ఇప్పుడు ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉంటే.. వారికి జీవిత కాలం ఉద్యోగాలు ఇచ్చేది లేద‌ని ఆర్మీ సికింద్రాబాద్‌విభాగం స్ప‌ష్టం చేసింది. ఇక‌, నిర‌స‌న కారుల‌పై పెట్టే సెక్ష‌న్లు రుజువైతే.. దోషుల‌కు యావజ్జీవ జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని.. రైల్వే వ‌ర్గాలు పేర్కొన్నాయి.

వెన‌క్కి త‌గ్గ‌ని కేంద్రం

సైనిక నియామకాల కోసం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్‌' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నా.. కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని కొనసాగించేందుకే బలంగా నిర్ణయించుకుంది. పలువురు కేంద్రమంత్రులు 'అగ్నిపథ్‌'కు మద్దతుగా గ‌ళం వినిపించారు. మరోవైపు ఈ పథకంపై ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ అధిపతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ పథకం కింద నియామక ప్రక్రియలకు అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. యువత దేశానికి సేవ చేసేందుకు 'అగ్నిపథ్‌' ఓ సువర్ణావకాశం అని, ఈ పథకం కింద నియామక ప్రక్రియ 'కొన్నిరోజుల్లో' ప్రారంభమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్  ట్విటర్‌లో స్పష్టం చేశారు.
Tags:    

Similar News