బెంగళూరుకు షాక్.. వారంలోనే వేలకొద్దీ కేసులు

Update: 2020-07-23 16:30 GMT
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల లాక్ డౌన్ విధించారు. మూడు దశల వరకూ కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేశారు. అనంతరం సడలింపులు ఇచ్చారు. కానీ లాక్ డౌన్ సడలింపుల తర్వాత భారీగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా కేసులు చెలరేగిపోతున్నాయి.

బెంగళూరులో ఈనెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొనసాగిన వారం రోజుల లాక్ డౌన్ షాకింగ్ ఫలితాలను ఇచ్చింది. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్న సమయంలోనే అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

లాక్ డౌన్ విధించిన ఈ వారం రోజుల వ్యవధిలో బెంగళూరులో ఏకంగా 13972 పాజిటివ్ కేసులు నమోదు కావడం షాకింగ్ గా మారింది. సాధారణ రోజులతో పోల్చుకుంటే ఏకంగా 45శాతం కేసులు అధికం కావడం అధికార వర్గాలను ఆందోళనలోకి నెట్టేసింది.

కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేసినా పాజిటివ్ కేసుల సంఖ్య ఎలా పెరిగిందనేది బెంగళూరు మున్సిపల్ అధికారులకు అంతుచిక్కడం లేదు. ఇక బెంగళూరులో నమోదైన మరణాల రేటు కూడా అధికంగా నమోదైంది. దీంతో లాక్ డౌన్ కొనసాగించడానికి కర్ణాటక ప్రభుత్వం వెనుకాడుతోంది.
Tags:    

Similar News