వరల్డ్ అప్డేట్: 65లక్షల కేసులు..3.88 లక్షల మరణాలు

Update: 2020-06-04 14:30 GMT
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వైరస్ విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచంలోని 213 దేశాలకు పాకింది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మృతదేహాలను భద్రపరచడానికి కొన్ని దేశాల్లో మార్చురీలు కూడా సరిపోని పరిస్థితి నెలకొంది.

అమెరికాలో మహమ్మారి విస్తృతి దారుణంగా వ్యాపిస్తోంది. వందల్లో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు 19,02,047 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా 1,09,146 అమెరికాలోనే అత్యధికం వెలుగుచూడడం విశేషం.

ఇక ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వైరస్ బాధితుల సంఖ్య 65,91,857కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 4928మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ కు ఇప్పటిదాకా 3,88,353 మంది చనిపోయారు. 31.88 లక్షల మంది కోలుకున్నారు.

అమెరికా తర్వాత వరుసగా కేసులు, మరణాల్లో రష్యా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ , బ్రిటన్ దేశాలున్నాయి. ఈ దేశాల్లో వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది.

*భారతదేశంలో మహమ్మారి పంజా..

భారత దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 2,17,965 కేసులు నమోదు కాగా.. 6091మంది మరణించారు. ఇప్పటివరకు 1,06,919 మంది మహమ్మారి వైరస్ నుంచి కోలుకొని బయటపడ్డారు.

*ఏపీలో పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 4080కి చేరింది. 4వేల మార్క్ ను దాటేసింది. ఇప్పటిదాకా ఏపీలో 68మంది మహమ్మారి కారణంగా మరణించారు. 2466 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

*తెలంగాణలో 3వేలు దాటిన కేసులు

తెలంగాణలో మహమ్మారి కేసుల సంఖ్య 3వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 3020కి చేరింది. ఇప్పటిదాకా 99మంది తెలంగాణలో మహమ్మారితో చనిపోయారు. 1556మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Tags:    

Similar News