జీడిపప్పు అలా తింటే బెడ్ మీద ఇరగదీయటమేనట

Update: 2019-11-13 09:30 GMT
మిగిలిన నట్స్ కు లేని గుణం జీడిపప్పులో మాత్రమే ఉండే ఒక గుణం.. రుచి. కావాలంటే చూడండి.. జీడిపప్పును గ్రేవీగా చేసి.. ఏ వంటలో వేసినా దాని రుచి రెట్టింపు అవుతుంది. అందుకు భిన్నంగా జీడిపప్పు బదులుగా బాదం.. అక్రూట్.. పిస్తా.. ఇలా మరే నట్ వాడినా జీడిపప్పు రుచి రాని పరిస్థితి. సరైన రీతిలో నెయ్యిలో వేయించిన జీడిపప్పు మీద పద్దతిగా ఉప్పుకారం చల్లి.. దోరగా వేపిన కరివేపాకుతో కలిపి తింటే ఆ మజానే వేరని చెబుతారు.

మంచింగ్ గా జీడిపప్పునకు మించింది మరొకటి ఉందంటారు. ఇక.. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కర్రీల్లో జీడిపప్పను యాడ్ చేస్తే.. దాని రుచి ఎంతలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా జీడిపప్పును రోజూ యాభై గ్రాములు తినే వారిలో శృంగార ఆసక్తి మస్తు పెరుగుతుందన్న సత్యం ఒక అధ్యయనంలో వెల్లడైంది.

పద్నాలుగు వారాల పాటు జరిపిన పరిశోధనలో జీడిపప్పు తో పాటు ఇతర నట్స్ తీసుకునే వారిలో శృంగార ఆసక్తితో పాటు భావప్రాప్తి కూడా మెరుగైనట్లు తేలింది.అంతేకాదు.. బరువు తగ్గించటంలోనూ.. మేధోశక్తిని పెంచుకోవటంలోనూ జీడిపప్పు కీలకభూమిక పోషిస్తుందని చెబుతున్నారు.

నట్స్ ను క్రమం తప్పకుండా తింటే బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు. జీడిపప్పుతో పాటు బాదం.. వాల్ నట్స్ లాంటి డ్రైఫ్రూట్స్ చేసే మేలు చాలా ఎక్కువంటున్నారు. డ్రైఫ్రూట్స్ లో ప్రొటీన్.. పీచు.. అత్యవసర విటమిన్లు.. ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేయటంతోపాటు.. బెడ్ మీద ఇరగ తీయటానికి ఛాన్స్ ఉందంటున్నారు. మరి.. మీ మెనూలో జీడిపప్పుకు మరింత ప్రయారిటీ ఇస్తారుగా?
Tags:    

Similar News