క్యాష్ లెస్ వివాహంతో ఆద‌ర్శంగా నిలిచారు

Update: 2016-12-18 09:38 GMT
రూ.500 - రూ.1000 నోట్ల ఉప‌సంహ‌ర‌ణ త‌ర్వాత క్యాష్‌లెస్ లావాదేవీలు కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో గుజరాత్‌ లో కొత్త జంట క్యాష్‌ లెస్ వెడ్డింగ్ ను జరుపుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. సూరత్‌ లో నూతన వధూవరులిద్దరూ పూర్తిగా డిజిటల్ లావాదేవీలతో వివాహం చేసుకోవడం విశేషం. అంతేకాదు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులందరూ క్రెడిట్ - డెబిట్ కార్డుల ద్వారా - చెక్కుల ద్వారా నగదును బహుమతులుగా అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. ఆ వివాహం ద్వారా ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించ‌డ‌మే కాకుండా చ‌క్క‌టి సందేశం అందించిన వారు అయ్యారు.

ఇదిలాఉండ‌గా మణిపూర్‌ లోని పశ్చిమ ఇంపాల్ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కొనసాగించవద్దని స్ప‌ష్టం చేశారు.  మణిపూర్ బాప్టిస్టు కన్వెన్షన్ సెంటర్ చర్చి - తాంగ్‌ ఖుల్ చర్చిపై దాడుల అంశంపై వదంతులు వస్తున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆదేశాలు విడుద‌ల అయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News