ఇక‌.. ఆంధ్రా ఆవుల‌న్నింటికి ఆధార్ నెంబ‌ర్లు

Update: 2017-06-01 07:10 GMT
హైటెక్ పాల‌న‌ను అందించేందుకు తెగ ఆరాట‌ప‌డే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. తాజాగా మ‌రో భారీ కార్య‌క్ర‌మానికి తెర తీశారు. ఏపీలోని ఆవుల‌న్నింటికి ప్ర‌త్యేక ఆధార్ నెంబ‌రును ఇచ్చే ప్ర‌క్రియ‌ను షురూ చేశారు. రాష్ట్రంలోని ఆవులు అన్నింటికి ప్ర‌త్యేక ఆధార్ నెంబ‌రు ఇవ్వ‌టం ద్వారా రాష్ట్రంలో ఆవుల లెక్క‌లు తేలిపోవ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో ఆవుల‌కు అందించే చికిత్స‌ల వివ‌రాలు ఎప్ప‌టికిప్పుడు తెల‌వ‌ట‌మేకాదు.. ప‌శువుల క‌ద‌లిక‌ల‌కు సంబంధించిన స‌మాచారం తెలిసే వీలుంటుంది.

అంతేకాదు.. ఆవుల‌కు ప్ర‌త్యేక ఆధార్ నెంబ‌ర్ల‌ను కేటాయించ‌టం ద్వారా ఆవుల వ‌య‌సు.. లింగం.. ఏ జాతికి చెందిన ఆవులు ఎన్ని ఉన్నాయి లాంటి వివ‌రాలు చేతి మునివేళ్ల‌కు అందుబాటులోకి వ‌చ్చే ప‌రిస్థితి. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఏపీలో 10.6 మిలియ‌న్ల ప‌శువులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న ఆవుల్లో పుంగ‌నూరు.. ఒంగోలు జాతి ప‌శువులు ప్ర‌త్యేక‌మైన‌వి. ఆవుల‌కు కేటాయించే ప్ర‌త్యేక ఆధార్ నెంబ‌రును స‌ద‌రు ప‌శువుల య‌జ‌మానుల ఆధార్ నెంబ‌ర‌కు అనుసంధానించ‌టం ద్వారా.. ప‌శువులు ఎక్క‌డ ఉన్నాయ‌న్న స‌మాచారం ఇట్టే తెలిసిపోతుంది. చాలా అరుదైన ఆవుల జాతిగా పేరున్న పుంగ‌నూరు.. ఒంగోలు జాతి ఆవుల్ని కాపాడేందుకు.. వాటిని సంర‌క్షించేందుకు ఈ కార్య్ర‌మం మ‌రింత సాయం చేస్తుంద‌ని చెబుతున్నారు.
ఇక‌.. గోవ‌ధ‌ను ఏపీ స‌ర్కారు ఎప్పుడో నిషేధించింది. 1977 ప్రొహిబిష‌న్ చ‌ట్టం ద్వారా గోవ‌ధ నిషేధం.. పాడి ఆవు లేదా ఒక దూడ‌.. మ‌గ‌.. ఆడ ఆవుల‌ను చంప‌టంపై నిషేధాన్ని విధించారు. ఆవుల‌కు ప్ర‌త్యేక ఆధార్ సంఖ్య‌ను కేటాయించ‌టం ఈ రోజు (జూన్ 1) నుంచి ఏపీలో షురూ చేయ‌నున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News