లక్ష వోట్లు వస్తే.. ఇంటర్ కోర్స్ ఓకె

Update: 2017-06-25 10:18 GMT
సెన్సార్ బోర్డ్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఓ సినిమాలో ఓకే చేసిన విషయాన్నే.. మరో సినిమాలో అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి. అలాగే ట్రైబ్యునల్ కు వెళ్లి మరీ సెన్సార్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం తప్పని మేకర్స్ ప్రూవ్ చేసినా సరే.. సెన్సార్ వ్యవహారం అలాగే ఉంటోంది.

రీసెంట్ గా 'జబ్ హారీ మెట్ సేజల్' అంటూ షారూక్ చేస్తున్న మూవీకి మిని ట్రయల్స్ రిలీజ్ చేస్తున్నారు. వీటిలో ఒక ట్రైలర్ లో అనుష్క శర్మ ఇంటర్ కోర్స్ అనే పదం ఉపయోగించడాన్ని సెన్సార్ బోర్డ్ తప్పు పట్టింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ పదాన్ని అనుమతించడానికి ఒక కండిషన్ పెట్టారు సెన్సార్ చీఫ్ పంకజ్ నిహలానీ. 'మీరు జనాల నుంచి ఓటింగ్ తీసుకోండి. ఆ ప్రోమోకు.. ఆ పదానికి.. వీలైతే ఆ సినిమాకు కూడా ఓటింగ్ పెట్టి.. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. ఇంటర్ కోర్స్ కు అనుకూలంగా  లక్ష ఓట్లు వస్తే.. నేను భారతీయ కుటుంబాల మైండ్ సెట్ మారుతోందని.. 12 ఏళ్లలోపు పిల్లలు కూడా ఆ పదానికి అర్ధం తెలుసుకునేందుకు అనుమతిస్తారని అంగీకరిస్తాను' అన్నారు పంకజ్.

ప్రస్తుతం ఈ ట్రయలర్ ఇంటర్నెట్ లో బాగానే హల్ చల్ చేస్తోంది కానీ.. టీవీల్లో థియేటర్లలో ప్రదర్శించాలంటే మాత్రం సెన్సార్ అనుమతి అవసరం. ఇప్పుడు పంకజ్ చెబుతున్న ప్రకారం అయితే.. ఇంటర్ కోర్స్ కు అనుకూలంగా లక్ష ఓట్లు వస్తే.. అప్పుడాయన ఆ పదాన్ని డెలీట్ చేయకుండానే సర్టిఫికేట్ ఇస్తారన్న మాట. మరి జనాల రియాక్షన్ ఎలా ఉందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News