వరుసగా వెలుగులోకి వస్తున్న బ్యాంక్ మోసాల్లో మరో సంచలన కేసు తెరమీదకు వచ్చింది. ఇది ఎక్కడిదో కాకుండా మన తెలుగు వ్యాపారవేత్త చేసిన నిర్వాకం కావడం ఆసక్తికరం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సహా ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంను రూ.1,394 కోట్ల మేరకు మోసగించిన టోటెమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ తొట్టెంపూడి సలలిత్ - డైరెక్టర్ తొట్టెంపూడి కవిత దంపతులను సీబీఐ అధికారులు శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేశారు. మార్చి 21న యూబీఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్రాంచీ సీనియర్ మేనేజర్ షేక్ మహమ్మద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గురువారం వీరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేవలం ఏడు ఎకరాల భూమిని - గుర్గావ్ (హర్యానా)లోని 3,740 చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని తనఖాగా పెట్టుకుని కోట్లాది రూపాయల రుణాలను మంజూరు చేసిన బ్యాంకు అధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. టోటెమ్ ఇన్ ఫ్రా సంస్థ పలు బ్యాంకుల నుంచి రుణాలను పొందింది. వీరికి రుణాలిచ్చిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఎస్ బీఐ (పూర్వపు ఎస్ బీహెచ్ - ఎస్ బీఎం) - పంజాబ్ నేషనల్ బ్యాంక్ - సిండికేట్ - బ్యాంక్ ఆఫ్ బరోడా - ఐడీబీఐ - కర్ణాటక బ్యాంకు - ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. వీటికి లీడ్ బ్యాంక్‌గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించింది. టోటెమ్ ఇన్ ఫ్రా రహదారుల ప్రాజెక్టులు - మంచినీటి నిర్మాణాలు - భవన నిర్మాణాలు చేపట్టే వ్యాపారంలో ఉంది. తాజా అప్పుల టోకరా ఫిర్యాదు నేపథ్యంలో గురువారం నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్ లోని టోటెమ్ సంస్థ కార్యాలయం - కంపెనీ యజమాని ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ కేసును విచారించడానికి సీబీఐ బెంగళూరు ఎస్పీ టీ రాజబాలాజీ.. డీఎస్పీ సత్యమూర్తిని నియమించారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టోటెమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేక పెద్దపెద్ద ఇన్ ఫ్రా కంపెనీలకు సబ్-కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తోంది. టోటెమ్ ఇన్ ఫ్రా సంస్థ రహదారుల ప్రాజెక్టులు - మంచినీటి పథకాలు - ఇతరత్రా నిర్మాణాలను చేపడుతుంది. ఎల్ అండ్ టీ - రైట్స్ - ఐఆర్ సీఓఎన్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలకు సబ్ కాంట్రాక్టర్లుగా వ్యహరించేవారని సమాచారం. ఈ కంపెనీ 1997 నవంబర్ 7న నమోదు అయ్యింది. తొట్టెంపూడి సలలిత్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. అజయ్ సింగ్ చౌహాన్ పూర్తికాలం డైరెక్టర్ గా సంస్థలో 2012 నవంబర్ 1న చేరారు. 2016 సెప్టెంబరు 1న అదనపు డైరెక్టర్ గా మదుసూధన్ రావు ముట్టే చేరారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఈ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను టోటెమ్ సంస్థ బదిలీ చేసిందని.. ఖర్చులను పెంచి చూపెట్టిందని ఓ అధికారి తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను దగా చేసిన టోటెమ్ ఇన్ ఫ్రా ప్రమోటర్లు గత కొంతకాలం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని బ్యాంకు వెల్లడించింది. ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియదని తెలియజేసింది. అయితే, హైదరాబాద్ కు చెందిన సంస్థ కావడంతో - నగరంలోని సంస్థ కార్యాలయాలపై సోదాలను నిర్వహిస్తోంది.