కోర్టుకు రాని జ‌గ‌న్ ఇష్యూలో కోర్టు ఏమందంటే?

Update: 2019-06-08 08:02 GMT
ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో చారిత్ర‌క విజ‌యాన్ని సొంతం చేసుకొని.. ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తి వారంలో హైద‌రాబాద్ లోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టుకు హాజ‌రు కాలేదు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో.. విధి నిర్వ‌హ‌ణ‌లో బిజీగా ఉన్న ఆయ‌న కోర్టుకు రాలేక‌పోతున్న వైనాన్ని జ‌గ‌న్ న్యాయ‌వాది కోర్టుకు నివేదించారు.

ఈ విష‌యాన్ని చెప్పే క్ర‌మంలో సీఆర్ పీసీ లోని సెక్ష‌న్ 317 కింద జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది ఒక పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. ఇదే కేసులో మ‌రో నిందితుడిగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నార‌ని.. ఆయ‌న బెజ‌వాడ ప‌రిధిలోని తాడేప‌ల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీల‌తో మీటింగ్ ఉన్నందున రాలేక‌పోతున్న‌ట్లుగా పేర్కొన్నారు.

జ‌గ‌న్ లాయ‌ర్ మాట‌ల‌కు స్పందించిన కోర్టు.. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను అనుమ‌తించారు. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 21కి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. సీబీఐ దాఖ‌లు చేసిన 11 చార్జిషీట్ల‌లో మొద‌టి ఐదు చార్జిషీట్ల‌ను దాఖ‌లు చేసుకున్న డిశ్చార్జ్ పిటిష‌న్ల‌ను క‌లిపి విచారించేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చిన వైనాన్ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు.

అన్ని చార్జిషీట్ల‌లో పేర్కొన్న ఆరోప‌న‌లు ఒకేలా ఉన్నాయ‌ని.. మిగిలిన ఆరు చార్జిషీట్ల‌కుసంబందించిన డిశ్చార్జ్ పిటిష‌న్ల‌ను క‌లిసి విచారించాల‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు. దీనికి స్పందించిన న్యాయ‌మూర్తి.. ఈ అంశంపూ పూర్తిగా విచారించిన త‌ర్వాతే తాను నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు.


Tags:    

Similar News