అరుదైన పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా కోర్టు కేసులకు సంబంధించి ఇన్ కెమెరా ప్రోసీడింగ్స్ ను కొన్ని కేసులకే పరిమితం చేస్తారు. దేశ భద్రత.. మహిళలు.. చిన్నారులపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసుల్లో విచారణను చేపడతారు. ఇన్ కెమెరా ప్రోసీడింగ్స్ సమయంలో కోర్టు న్యాయమూర్తి.. ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులతో పాటు.. కొద్ది మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారిని కోర్టు హాలు నుంచి బయటకు పంపుతారు.
జగన్ మీద సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుపుతున్న కేసు విచారణను భిన్నంగా నిర్వహించారు. ఈ కేసులో జగన్ తోపాటు ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు.. సీబీఐ న్యాయవాదులు మాత్రమే కోర్టులో ఉండాలని.. మిగిలిన వారంతా బయటకు వెళ్లిపోవాలని పేర్కొన్నారు.
అనంతరం కోర్టు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అనంతరం కేసు విచారణను చేపట్టారు. సాధారణంగా ఇలాంటి విచారణ చాలా కొద్ది కేసుల్లో మాత్రమే చేపడతారని చెప్పాలి. కాకుంటే.. జగన్ ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో.. కొన్ని వ్యాఖ్యలు సున్నితంగా ఉండటం.. వాటిని చిలువలు పలువలు చేసే పరిస్థితులు ఉండటంతో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేపట్టి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. ఇలాంటివి చాలా అరుదుగా చెబుతున్నారు.