వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగానే పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. తనపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసుల్లో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ వాదనను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజా తీర్పుతో ఇటు ఈడీ కేసుల విచారణతో పాటు సీబీఐ కేసుల విచారణకు కూడా జగన్ వ్యక్తిగతంగా హాజరు కాక తప్పదు. అంటే... ప్రతి శుక్రవారం జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మెట్లెక్కక తప్పదన్న మాట.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డ జగన్ ఏకంగా రూ.43 వేల కోట్లకు పైగా అక్రమాదాయాన్ని కూడబెట్టారని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా జగన్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లను దాఖలు చేయగా... విచారణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టగా... జగన్ సీఎం సీట్లో కూర్చున్నారు. సీఎం హోదాలో ఉన్న తాను ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని, అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొంటూ సీబీఐ కేసులు, ఈడీ కేసులకు వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. సీబీఐ నమోదు కేసుల విషయంలో జగన్ కు వ్యక్తిగత మినహాయింపు కుదరదంటూ గత వారమే సంచలన తీర్పు చెప్పింది. తాజాగా శుక్రవారం ఈడీ కేసుల నుంచి వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా విచారించిన సీబీఐ కోర్టు... ఈ కేసుల విచారణకు కూడా జగన్ కు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను తోసిపుచ్చింది. మొత్తంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను కోర్టు కొట్టేయగా... ఇకపై జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లక తప్పదు.