జగన్ హాజరుపై కోర్టు కీలక ఆదేశం

Update: 2020-01-03 11:50 GMT
ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన కోర్టుకు తప్పకుండా హాజరుకావాలని హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసులో ప్రస్తుతం ఏ1గా సీఎం జగన్ ఉన్నారు. ఏ2గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. వీరు ఈ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. వారి తరుఫున న్యాయవాదులు హాజరై  మినహాయింపు ఇవ్వాలని.. సీఎంగా బిజీగా ఉన్నారని కోర్టుకు విన్నవించారు.  ఈ మేరకు కోర్టులో జగన్ తరుఫున పిటీషన్ దాఖలు చేశారు.

దీనిపై వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్, విజయసాయిరెడ్డిలు విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 10న విచారణకు హాజరు కావాలని కోరింది. కేసులకు, హోదాకు సంబంధం లేదని న్యాయస్థానం పేర్కొంది.

    

Tags:    

Similar News