మాట వినని విపక్ష రాజకీయ నేతలకు షాకులివ్వటంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సరికొత్త పద్ధతుల్ని తెర మీదకు తెచ్చిన వైనం తెలిసిందే. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా షురూ చేసిన ఈ వేధింపుల విధానాన్ని ప్రధాని మోడీ మరో రేంజ్లో కొనసాగిస్తున్నారన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.
సీఎం.. మాజీ సీఎం.. ఇలా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి సైతం సీబీఐ.. సీఐడీ పేరుతో వణుకు పుట్టిస్తున్న కేంద్రం తాజాగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై ఫోకస్ చేసిందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తరచూ తన మాటలతో వివాదాలకు తెర తీసే ఆయనపై సీబీఐ సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
కశ్మీర్ లోక్రికెట్ స్టేడియం.. అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణకు బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా నుంచి రూ.38 కోట్ల నిధులు తీసుకొని దుర్వినియోగం చేశారన్న ఆరోపణల్ని ఫరూక్ ఎదుర్కొంటున్నారు.
ఫరూక్ తో పాటు జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ఛైర్మన్ మహ్మద్ అస్లాంగోని.. జేకేసీఏ సెక్రటరీ సలీమ్ ఖాన్.. కశ్మర్ బ్యాంక్ ఛైర్మన్ బషీర్ పేర్లు కూడా సీబీఐ తన ఛార్జ్ షీట్లో నమోదు చేసింది. కశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పేసి..కొత్త మిత్రులతో కలిసి అధికారాన్నిచేపట్టేందుకు బీజేపీ నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవచ్చని.. ఇవి బీజేపీకి షాకింగ్ గా మారతాయన్న మాట వినిపిస్తున్న వేళ.. సీబీఐ ఎంటర్ కావటం.. మాజీ ముఖ్యమంత్రిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఫరూక్ కు సీబీఐ ఛార్జ్ షీట్ ముచ్చట తెలిసిందో లేదో? ఇదిలా ఉంటే.. ఫరూక్ మీద సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.