వైఎస్ వివేకా హత్యపై సీబీ‘ఐ’.. ఏం జరగబోతోంది?

Update: 2020-06-19 11:30 GMT
చంద్రబాబు సీఎంగా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల వేళ జరిగిన వైఎస్ వివేకా హత్య సంచలనమైంది. సీఎంగా జగన్ ఎన్నికయ్యాక దీనిపై సిట్ ఏర్పాటు చేసి విచారించారు. ఆ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కడప జిల్లా ముఖ్య నేతల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య ఇప్పటికీ తేలకపోవడం రాజకీయంగా సంచలనమైంది. ఏడాది దాటినా నిందితులు ఎవరనేది కనుక్కోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ వివేకా హత్యపై ఆయన కూతురు హైకోర్టుకెక్కడంతో సీబీఐ దర్యాప్తును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కరోనా ముగిశాక సడలింపుల నేపథ్యంలో విచారణకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

మార్చిలోనే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇంతలో కరోనా రావడం.. లాక్ డౌన్ తో సీబీఐ రంగంలోకి దిగలేదు. తాజాగా అన్ లాక్ ప్రకటించడంతో సీబీఐ దర్యాప్తునకు రెడీ అవుతోందట..దీంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News