అక్రమాలు చేయలేదు కానీ.. అక్రమ సొమ్ము ఖర్చు పెట్టారన్న ఆరోపణ గాలి జనార్ధన్ రెడ్డిని కిందామీదా పడేస్తోంది. ఇప్పటికే పీకకు చుట్టుకున్న అక్రమ మైనింగ్ ఆరోపణల నుంచి బయట పడని ఆయనకు.. కుమార్తె పెళ్లికి చేసిన భారీ ఖర్చు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. తాను చేసే ప్రతి పని మీదా సీబీఐ నజర్ ఉంటుందన్న విషయం తెలిసిన నేపథ్యంలో ఆచితూచి ఖర్చు చేసినట్లుగా చెబుతున్నప్పటికీ.. భారీ ఎత్తున అక్రమ సంపాదనను కుమార్తె వివాహానికి ఖర్చు చేసినట్లుగా సీబీఐ భావిస్తోంది.
ఇప్పటికే పెళ్లి ఖర్చు లెక్క చెప్పాలంటూ నోటీసులు పంపిన సీబీఐ.. గాలికి తమదైన రీతిలోఒక ప్రశ్నావళిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఖర్చుల వివరాల్ని ఇందులో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. పలు మీడియా కథనాల ప్రకారం.. కుమార్తె పెళ్లి కోసం గాలి జనార్ధన్ రెడ్డి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇక.. గాలికి సీబీఐ వేసిన ప్రశ్నల్నిచూస్తే..
= పెళ్లి వేడుకకు ముందు జరిగిన ఖర్చు ఎంత? తర్వాతి ఖర్చు ఎంత?
= పెళ్లికి ఎంత మంది హాజరయ్యారు?
= పెళ్లి వేడుకను నిర్వహించిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కు ఎంత ఖర్చు చేశారు?
=వేడుక దగ్గర భద్రతా ఏర్పాట్లు చూసిన బౌన్సర్లకు ఇచ్చింది ఎంత? ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేశారు?
= రవాణా.. వసతి సదుపాయాలు.. వినోద కార్యక్రమాల ఖర్చుల లెక్కేంటి?
= ప్యాలెస్ లో భారీగా నిర్మించిన కళాఖండాలకు ఎంత ఖర్చు చేశారు?
= పెళ్లి శుభలేఖలకు పెట్టిన ఖర్చు ఎంత?
= పెళ్లి కుమార్తె బ్రాహ్మణి కోసం కొనుగోలు చేసిన ఆభరణాల విలువెంత?
= పెళ్లి కోసం కొనుగోలు చేసిన ఖరీదైన వస్త్రాల వివరాల విలువ ఎంత?
= ఖరీదైన వస్తువుల్ని ఎక్కడ కొన్నారు? అందుకోసం ఎంత చెల్లించారు?
= పెళ్లి సందర్భంగా అతిధులకు ఇచ్చిన కానుకుల విలువ ఎంత? ఏమేం కానుకలు ఇచ్చారు.
= పెళ్లి ఖర్చుల్ని ఏయే బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించారు?
= ఖర్చుల చెల్లింపుల కోసం వాడిన డెబిట్.. క్రెడిట్ కార్డుల వివరాలు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/