బ్రేకింగ్: మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లపై సీబీఐ దాడి

Update: 2019-12-31 04:45 GMT
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, ఆఫీసుల్లో ఏక కాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

రాయపాటి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తో పాటు పలు కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ, గుంటూరు ఢిల్లీలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

300 కోట్ల రూపాయల బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణం చెల్లంచకుండా ఎగ్గొట్టడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు లో భాగంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో లో ఎండీ ఆస్తులపై కూడా సోదాలు నిర్వహిస్తోంది.

బ్యాంక్ లను మోసం చేసిన వ్యవహారం లో రాయపాటి ఫై గతం లోనే సీబీఐ కేసు నమోదైంది. ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లో సైతం సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.
Tags:    

Similar News