దేశంలోనే కీలక కేసులన్నింటి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అంటే... ఎవరికైనా దడే. సామాన్యుల నుంచి కాకలు తీరిన రాజకీయ నేతల దాకా సీబీఐ అంటే హడలే. అలాంటి సీబీఐపై ఆప్ కన్వీనర్ - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అదిరిపోయే పంచ్ లేశారు. అయినా కేజ్రీ ఏ వ్యక్తిని, ఏ సంస్థను వదిలలేదుగా. మరి తన అనుంగు అనుచరుడు - ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిద్ధమైన సీబీఐని ఆయన ఎందుకు వదులుతారు? వదలరు కానీ... సీబీఐపై కేజ్రీ వేసిన పంచ్ లు చూస్తే... నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. అయినా సీబీఐపై కేజ్రీవాల్ వేసిన పంచ్‌ల విషయానికోస్తే... జనంతో పాటు బడా బాబులను బెంబేలెత్తించే సీబీఐ అధికారులు... మనీశ్ సిసోడియాను చూసి జడుసుకుని చస్తున్నారట.
సీబీఐ అధికారులు ఇప్పటిదాకా ఏ ఒక్కరికి కూడా భయపడిన దాఖలా లేదట. ఈ విషయాన్ని కూడా కేజ్రీనే సెలవిచ్చారు. గతంలో ఏ ఒక్కరికీ భయపడని సీబీఐ... ఇప్పుడు మనిశ్ సిసోడియాను చూసి వణుకుతోందట. సీబీఐ అధికారుల కోసం మనీశ్ సిసోడియా ఎదురుచూస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేజ్రీ... అసలు సిసోడియాను తాకే సాహసం సీబీఐ అధికారులు చేయలేరని కూడా ఘాటు కామెంట్లే చేశారు. నిన్న ట్విట్టర్ వేదికగా కేజ్రీ చేసిన వ్యాఖ్యలను యధాతథంగా చూస్తే... సీబీఐ అధికారుల పేరు చెబితేనే ఇప్పటికీ ప్రజలు ఎంతో భయపడతారు. అలాంటిది మునుపెన్నడూ లేనిది తొలిసారిగా ఓ వ్యక్తి (మనీశ్ సిసోడియా)ని చూసి సీబీఐ భయపడుతోంది. సీబీఐ అధికారుల కోసం మనీశ్ సిసోడియా ఎదురుచూస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితి రాదు* అని ఆయన వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/