బాపట్ల జిల్లా చీరాల వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ షాక్ ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది. జూన్ 22న బుధవారం జరిగే విచారణకు హాజరుకావాలని ఆయనకు సెక్షన్ 41ఎ కింద నోటీసు అందజేసింది. దీంతో ఆమంచి కృష్ణమోహన్ విచారణకు హాజరుకానున్నారు.
ఇప్పటికే న్యాయమూర్తులను, హైకోర్టును దూషించిన కేసులో ఒకసారి ఆమంచి కృష్ణమోహన్ ను సీబీఐ అధికారులు విచారించారు. ఇప్పుడు రెండోసారి విచారించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో పలుమార్లు తీర్పులు వచ్చాయి.
కొన్ని నిర్ణయాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో హైకోర్టును, హైకోర్టు న్యాయమూర్తులను నిందిస్తూ, దూషిస్తూ, వారిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్సీపీ నేతలే. అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు ఉన్నారు. ఈ దూషణలపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
దీంతో ఈ కేసును అప్పటి నుంచి సీబీఐ విచారిస్తోంది. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసి విచారించింది. విదేశాల్లో ఉన్న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు పంచ్ ప్రభాకర్ కూడా తన యూట్యూబ్ చానల్ లో హైకోర్టు న్యాయమూర్తులను దూషించడంతో అతడిపై కూడా కేసు నమోదు చేసింది. అంతేకాకుండా అతడి యూట్యూబ్ చానల్ ను రాకుండా నిషేధం విధించేలా చేశారు. అప్పటి నుంచి పంచ్ ప్రభాకర్ విదేశాల్లోనే దాక్కున్నాడు.
న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బుధవారం సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆమంచి కృష్ణమోహన్ కు నోటీసులు పంపారు. దీంతో ఆయన మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసును హైకోర్టు కూడా సీరియస్ గా తీసుకోవడంతో సీబీఐ కూడా నిందితుల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు బుధవారం విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నీవేదిక ఇచ్చేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మిగతా నిందితులపై ఇప్పటికే పలుమార్లు హైకోర్టుకు సీబీఐ నివేదికలు అందజేసింది.
కాగా ఆమంచి కృష్ణమోహన్ 2009, 2014లో చీరాల నుంచి ఘనవిజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో నవోదయం పార్టీ (ఇండిపెండెంట్)గా పోటీ చేసి గెలుపొందారు. అయితే వైఎస్సార్సీపీ గాలి బలంగా వీచిన 2019లో మాత్రం చీరాల నుంచి ఓడిపోయారు.