వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సమాచారం

Update: 2020-09-26 10:50 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత బాబాయ్, నేత అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. ఆ హత్యకేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది.

తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ జోరు పెంచింది. వారం రోజులుగా పలువురు అధికారులను ప్రశ్నించింది. కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

తాజాగా కడప జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు.. పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ఇద్దరు మహిళలతోపాటు చెప్పుల షాప్ లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఆ చెప్పుల వ్యాపారి మున్నాను ఆరాతీశారు.

మున్నా ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయన బ్యాంకు లాకరులో భారీ మొత్తంలో నగదును సీబీఐ అధికారులు గుర్తించారు. మూడు రోజుల క్రితం మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

ఇక వివేకానందరెడ్డి హత్య జరిగిన నాటి ముందురోజు కాణిపాకం ఎందుకు వెళ్లాడనే దానిపై ఆయన ఇంట్లో పనిచేసే రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. కాణిపాకంలోనూ విచారణ జరిపారు. దీంతో వైఎస్ వివేకాకు సంబంధించిన హత్య కేసు గుట్టులో కీలక సమాచారం దొరికినట్టు ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News