సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అనుమానిస్తోందా ? పులివెందుల కోర్టులో గతంలో సీబీఐ దాఖలు చేసిన అబియోగపత్రాల్లో ఈ విషయాన్ని సీబీఐ స్పష్టంగా చెప్పింది. తన అనుచరుడు దేవిరెడ్డి శివశకంరరెడ్డి ద్వారా ఎంపీ వివేకాను హత్య చేయించారని తమకు అనుమానం ఉందని సీబీఐ చెప్పింది. అయితే తన అనుమానానికి సీబీఐ చెప్పిన కారణం మాత్రం చాలా సిల్లీగా ఉంది.
ఇంతకీ సీబీఐకి అనుమానం రావటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే కడప ఎంపీ టికెట్ తనకు లేదా వైఎస్ షర్మిల లేదా విజయమ్మల్లో ఎవరో ఒకరికే ఇవ్వాలి కానీ అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదని వివేకా అనుకున్నారట. వివేకా ఆలోచనలు తెలుసుకున్న అవినాష్ రెడ్డి వెంటనే తన అనుచరుడిని పురమాయించి వివేకాను హత్య చేయించారేమోనని సీబీఐ అనుమానిస్తోంది. ఇక్కడే సీబీఐ అనుమానాలపై చాలా అనుమానాలున్నాయి.
అవేమిటంటే టికెట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి. విజయమ్మ, షర్మిల వివేకా లేదా అవినాష్ అయినా జగన్ టికెట్ ఇస్తేనే పోటీ చేయగలరని అందరికీ తెలిసిందే. అలాంటపుడు జగన్ను ఎవరైతే ప్రభావితం చేయగలరో లేదా గుడ్ లుక్స్ లో ఉంటారో టికెట్ వాళ్ళకే దక్కుతుందనటంలో సందేహంలేదు. ఒకవేళ టికెట్ కోసం పోటీ పడుతున్నారు కాబట్టే వివేకాను హత్య చేయాలని అవినాష్ అనుకుంటే మరి షర్మిల, విజయమ్మల మాటేమిటి ?
తనకు పోటీలో ముగ్గురున్నపుడు కేవలం వివేకాను మాత్రమే అడ్డు తొలగించుకుంటే మరి మిగిలిన ఇద్దరి సంగతేమిటి ? వివేకాను హత్య చేసినంత మాత్రాన తనకు టికెట్ వస్తుందనే గ్యారెంటీ ఏముంది అవినాష్ కు. జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి జగన్ వెంటున్నది అవినాషే కానీ వివేకా కాదని అందరికీ తెలుసు. ఈ రకంగా చూసుకుంటే వివేకాకన్నా జగన్ కు అవినాషే నమ్మకస్తుడు.
కాబట్టి ఏ రకంగా చూసుకున్నా వివేకా హత్య వెనుక కేవలం ఎంపీ టికెట్ మాత్రమే కారణమంటే నమ్మేట్లుగా లేదు. ఇంకేదైనా బలమైన కారణం ఉందేమో అనే విషయంలో సీబీఐ దర్యాప్తు చేస్తే బాగుంటుంది.