విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా కేసులో దర్యాప్తు ని సీబీఐ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ ని అతని ఇంట్లోనే విచారణ చేశారు అధికారులు. సతీష్ తో పాటు అతడి స్నేహితుల్ని కూడా విచారణ చేస్తున్నారు సీబీఐ అధికారులు.
పదేళ్ల క్రితం ఆయేషా మీరా హత్య ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న సత్యంబాబు కొన్నాళ్లు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత హత్య కేసులో అతని ప్రమేయం ఉన్నట్లు రుజువు కాకపోవడంతో విడుదల అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సత్యంబాబుని కూడా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.
అయితే.. ఆయేషా మీరా హత్యకేసులో అసలు సత్యంబాబుకి సంబంధమే లేదని.. అతడ్ని కావాలనే ఇరికించారని మొదటినుంచి ఆరోపిస్తున్నారు ఆయేషా తల్లి. ఈ హత్య చేసింది కొనేరు రంగారావు మనవడు అయిన కోనేరు సతీష్ అని చాలాసార్లు ఆమె ఆరోపించారు. హత్య జరిగిన హాస్టల్ కు కోనేరు సతీష్ ప్రతీరోజు వచ్చేవాడని.. స్నేహితులతో కలిసి అక్కడే మద్యం సేవిస్తూ ఆడపిల్లల్ని ఏడపించేవాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. ఆయేషాను హత్య చేసింది కోనేరు సతీష్, అతని స్నేహితులే అని ఆయేషా తల్లి ఆరోపణలు చేశారు. హత్య జరిగిన సమయంలో.. కోనేరు రంగారావు డిప్యూటీ సీఎంగా ఉన్నారని.. ఆయన పలుకుబడితో సతీష్ ని కేసు నుంచి తప్పించారని ఆయేషా తల్లి ఆరోపించారు. దీంతో.. సీఐడీ అధికారులు అప్పట్లో కోనేరు సతీష్ ను విచారించారు. ఆధారాలు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారీ సిబీఐ అధికారులు సతీష్ ని విచారణ చేయడంతో.. ఆయేషా కేసులో కొత్త ట్విస్ట్ మొదలైందనే చెప్పాలి.