తెలంగాణలో హేమంత్ అనే యువకుడి పరువు హత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడ ప్రణయ్ ఘటన తర్వాత దాదాపుగా అదే తరహాలో జరిగిన ఈ ఘటన పెను దుమారం రేపింది. హేమంత్ ను అవంతి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని అవంతి తల్లిదండ్రులు - బంధువులు కుట్ర పూరితంగా హేమంత్ ను హత్య చేయించారని అవంతితోపాటు - హేమంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జూన్ 10న తాము పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టామని - తమ పెళ్లి తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని అవంతి చెప్పింది. ఈ క్రమంలోనే తమను శుక్రవారం నాడు తమ బంధువులు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశారని - తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అవంతి తన భర్తను కిడ్నాప్ చేసిన కారు వెంట పరిగెడుతున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు గుర్తించారు.
తమను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నారని - తనకు అనుమానం వచ్చి కేకలు పెట్టానని అవంతి చెప్పింది. రింగ్ రోడ్డు వైపు తీసుకెళ్లిన తర్వాత హేమంత్ తోపాటు తాను కూడా కారులో నుంచి దూకేశానని - తనను అక్కడే వదిలేసి హేమంత్‌ను కొట్టుకుంటూ తీసుకొని వెళ్లారని అవంతి చెపపింది. తాను 100కు ఫోన్ చేశానని - 40 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారని అవంతి చెప్పింది.అవంతి చెప్పిన వివరాల ప్రకారం పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద హేమంత్ ను బలవంతంగా తీసుకుని వెళ్లిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో అక్కడ జనం గుమిగూడి ఉండడం - అవంతి పరుగులు పెట్టడం సీసీటీవీ ఫుటేజిలో రికార్డయిందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అవంతి తల్లిదండ్రులు - మేనమామ - కొందరు బంధువులు సహా మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి హేమంత్ ను అవంతి మేనమామ హత్య చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
Full View