ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌..అమల్లోకి కోడ్

Update: 2017-01-04 08:01 GMT
దేశంలో మ‌రో భారీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. సీఈసీ న‌జీం అహ్మ‌ద్ జైదీ ఈ షెడ్యూల్‌ ను ప్ర‌క‌టించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ - పంజాబ్‌ - ఉత్త‌రాఖండ్‌ - మ‌ణిపూర్‌ - గోవాల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవాళ్టి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వచ్చిన‌ట్లు జైదీ చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 5 నుంచి ఈ రాష్ట్రాల ఎల‌క్టోర‌ల్ రోల్స్‌ ను ప్ర‌క‌టించ‌నున్నారు. 16 కోట్ల‌కుపైగా ఓట‌ర్లు ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొన‌నున్నారు. మొత్తం ల‌క్షా 85 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నారు. ఈసారి ఎన్నిక‌ల సంఘ‌మే ఓట‌రు స్లిప్పుల‌తో పాటు ఎన్నిక‌ల స‌మ‌యం - పోలింగ్ స్టేష‌న్లు - గుర్తింపు కార్డుల వివ‌రాలు చెప్పే క‌ర‌ప‌త్రాన్ని కూడా అందించ‌నున్న‌ట్లు చెప్పారు. ఓటును మ‌రింత ర‌హ‌స్యంగా ఉంచ‌డం కోసం ఓటింగ్ కంపార్ట్‌ మెంట్ల ఎత్తును 30 అంగుళాల మేర పెంచిన‌ట్లు తెలిపారు.

ఐదు  రాష్ట్రాల్లోనూ ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌నే ఉప‌యోగించ‌నున్నారు. ఓట‌ర్లు తాము ఎవ‌రికి ఓటు వేశామో తెలుసుకునే వీలు క‌ల్పించిన‌ట్లు సీఈసీ జైదీ తెలిపారు. అభ్య‌ర్థుల అఫిడ‌విట్‌లోనూ మార్పులు చేసిన‌ట్లు చెప్పారు. తాను భార‌త పౌరుడిన‌ని ధృవీక‌రించాల‌ని, త‌న ఫొటోను నామినేష‌న్ పత్రాల‌కు అటాచ్ చేయాల‌ని, నో డిమాండ్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని జైదీ వెల్ల‌డించారు. యూపీ - పంజాబ్‌ - ఉత్త‌రాఖండ్‌ ల‌లో అభ్య‌ర్థుల ఖ‌ర్చు రూ.28 లక్షలుగా, మ‌ణిపూర్ - గోవాల‌లో రూ.20 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. విరాళాలు రూ.20 వేలు అయితే బ్యాంకుల నుంచి జ‌ర‌గాల‌ని, అది కూడా చెక్కుల ద్వారానే అని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టంచేసింది.

గోవా షెడ్యూల్‌: ఫిబ్రవ‌రి 4న ఎన్నిక‌లు
నోటిఫికేష‌న్‌: జ‌న‌వ‌రి 12న‌
నామినేష‌న్ల దాఖ‌లు చివ‌రి రోజు: జ‌న‌వ‌రి 18
ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి రోజు: జ‌న‌వ‌రి 21

పంజాబ్ షెడ్యూల్‌: ఫిబ్ర‌వ‌రి 4న ఎన్నిక‌లు
నోటిఫికేష‌న్‌: జ‌న‌వ‌రి 11న‌

Tags:    

Similar News