ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు పెళ్లి వేడుకల సందర్భంగా తుపాకి తూటాలను పేలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ తరహా వెడ్డింగ్ గన్ కల్చర్ గురించి మనం వింటూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆ గన్ మిస్ ఫైర్ అయి పెళ్లి వేడుకకు హాజరైన వారిలో ఎవరో ఒకరు గాయపడడం వంటివి జరుగుతుంటాయి. అయితే, తాజాగా, హర్యాణాలో పెళ్లి వేడుకల్లో జరిగిన వెడ్డింగ్ గన్ ఫైర్ వల్ల తీవ్ర విషాద ఘటన జరిగింది. గన్ మిస్ ఫైర్ అవ్వడం వల్ల పెళ్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందడంతో పెళ్లి వేదిక వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో పెళ్లికొడుకు స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. హర్యానాలోని కైథాల్ జిల్లా గుల్హాలోని చీకా టౌన్ షిప్ లో ఈ దుర్ఘటనలో గన్ పేల్చింది పెళ్లి కొడుకు సోదరుడు కావడం విశేషం.
స్విట్జర్లాండ్ లో నివసించే ఎన్నారై విక్రమ్ జిత్ సింగ్ (36) వివాహ వేడుకను ఆదివారం నిశ్చయించారు. శనివారం అర్ధరాత్రి నిర్వహించిన కార్యక్రమం `జాగో`లో భాగంగా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో విక్రమ్ సోదరుడు సురేందర్ సింగ్ ఆనందంతో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే, పొరపాటున గన్ మిస్ ఫైర్ అవ్వడంతో పెళ్లికొడుకు, అతడి స్నేహుతుడు నవ్ తేజ్ సింగ్ శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. విక్రమ్ జిత్ సింగ్ ఘటనాస్థలంలోనే మృతి చెందగా - నవ్ తేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరూ నిందితుడు - బాధితుడిగా ఉండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నామని, నిందితుడి త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఏదేమైనా వివాహ వేడుకలో వినోదం కోసం చేసిన పని మూడు కుటుంబాల్లో విషాదం నింపడం పలువురిని బాధించింది. వివాహ వేడుకల్లో గన్ ఫైర్ కల్చర్ ను అరికట్టాలని, తమ ఆనందాన్ని చాటుకోవడానికి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.