భారతదేశంలో అడుగడుగునా హిందూమతం ఉంది... అదేసమయంలో ఇక్కడ ఇతర మతాలు అంతే ప్రాధాన్యంతో మనగలుగుతున్నాయి. అందుకే ప్రపంచలోనే అతిపెద్ద లౌకిక దేశంగా భారత్ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటోంది. వ్యక్తి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ప్రకారం దేశంలో ఎందరో ఒక మతం నుంచి మరో మతంలోకి మారుతున్నారు. దీనిపై సహనం, అసహనం అన్నీ ఇండియాలో కనిపిస్తుంటాయి.
తాజాగా ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పై ఫత్వా జారీకావడం... ఆయన్ను హిందూమతంలోకి రావాలని విశ్వ హిందూపరిషత్ ఆహ్వానించడం తెలిసిందే. జన్మతః హిందువే అయిన రెహమాన్ అనంతరం ఇస్తాంలోకి మారాడు... ఇప్పుడు మళ్లీ ఆయన్ను హిందూమతంలోకి మారాలంటూ వీహెచ్ పీ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో హిందూమతంలోకి మారిన పలువురు సెలబ్రిటీల గురించి ''తుపాకీ'' సందర్హోచిత కథనం...
సంప్రదాయాలు, విలువలు వల్లయితేనేమి... ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వల్లయితేనేమి హిందూమతం ప్రపంచంలో చాలామందిని ఆకర్షించింది. హిందూమతంపై ఆసక్తి పెంచుకుని.. ఇక్కడికొచ్చి మతం మారిన వారు కొందరైతే.... భారతదేశ పర్యటనకు వచ్చిన తరువాతే ఆకర్షితులై మతం మారిన వారూ ఉన్నారు. మతం మారకుండానే హిందూ విధానాలను పాటిస్తున్నారూ ఉన్నారు. ఇక్కడి సంగీత, నృత్య రీతులను నేర్చుకుంటూ మత విధానాలకూ అలవాటు పడినవారు.. యోగా, ఆయుర్వేద వైద్యం కారణంగా హిందూయిజంస్వీకరించినవారు ఉన్నారు. అలాగే పుట్టపర్తి, ఇస్కాన్.. ఇతర పలు యోగులు, గురువుల వద్ద ఉంటూ ఈ మతం పట్ల అనురక్తి పెంచుకున్నవారు చాలామంది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో ఆ జాబితాలో ఉన్నారు.
- జూలియా రాబర్ట్స్:
'ప్రెట్టీ ఉమన్'గా పేరొందిన ఈ హాలీవుడ్ నటి హిందూమతంలోకి మారారు. ఇండియాలో తన సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఆమె ఇక్కడ హిందూమత బోధనలు విని ఆసక్తిపెంచుకున్నారు. అనంతరం మతం మారిపోయారు. ఆమె తన ప్రొడక్షన్ కంపెనీకి కూడా రెడ్ ఓం ఫిల్మ్స్ అని పేరు పెట్టుకున్నారు
- క్లాడియా సీస్తా..:
అమెరికన్ మోడల్, నటి. పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. హిందీ, పంజాబీ బాషలు నేర్చుకుంది. ఈమె కూడా హిందూత్వం పట్ల ఆకర్షితురాలై మతం మార్చుకుంది.
- నర్గీస్:
సునీల్ దత్ ను పెండ్లాడిన తరువాత నర్గీస్ తన మతం మార్చుకున్నారు. మదర్ ఇండియా వంటి సినిమాలతో దేశమంతటా ఆదరణ పొందిన ఈమె సహనటుడు సునీల్ దత్ ను ప్రేమించి పెళ్లాడారు. అనంతరం నిర్మల దత్ గా పేరు మార్చుకున్నారు.
- రస్సెల్ బ్రాండ్:
హాలీవుడ్ లో కామెడీకి మారుపేరు ఈయన. నటుడు, రచయిత కూడా.. హిందూ మతాన్ని నచ్చి ఆ మతంలోకి మారిన ఈయన తన వివాహాన్ని కూడా భారత్ లోనే జరుపుకొన్నారు. కేటీ పెర్రీని ఆయన భారత్ లో హిందూ మతాచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
- కాగా జాతిపిత మహాత్మాగాంధీ పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ ఒకప్పుడు ఇస్తాంలోకి మారారు. అనంతరం ఆయన మళ్లీ హిందూమతంలోకి మారారు.
--- గరుడ