ఆసక్తికర సమాచారంగా చెప్పాలి. అధికారికంగా వెల్లడి కాకున్నా..మీడియా వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారంగా దీన్ని పరిగణించాలి. నంది అవార్డుల వివాదం నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేక చర్చ పేరుతో భారీ వాదనకు వేదికగా తమ ఛానల్ తరఫున సిద్ధం చేశారు.
స్వయంగా ఛానల్ యజమానే చర్చకు సమన్వయం చేసేందుకు రెఢీ కావటంతో.. కార్యక్రమం గ్రాండ్ గా ఉండాలన్న ప్రయత్నంతో సదరు ఛానల్ సిబ్బంది కిందామీదా పడ్డారు. ఛానల్ యజమాని సీన్లోకి వస్తున్న నేపథ్యంలో చర్చకు సినిమా ఇండస్ట్రీలో పెద్ద తలకాయలతో చర్చ పెట్టాలనుకున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు పలువురు తాము చర్చకు వస్తామని చెప్పారట.
అక్కడి వరకూ బాగానే ఉన్నా.. చర్చ సమయానికి మాత్రం వచ్చినోళ్లను చూసి సదరు ఛానల్ యజమాని షాక్ తిన్నంత పనైందట. తనతో నిత్యం టచ్ లో ఉండే ప్రముఖులు సైతం చర్చకు రావటానికి ఇష్టపడలేదట. ఆహ్వానించినప్పుడు తప్పనిసరిగా అన్న మాటను చెప్పినోళ్లే.. తీరా సమయం దగ్గరకు వచ్చేసరికి జ్వరంగా ఉందని.. ఒంట్లో బాగోలేదని.. ఆవుటాఫ్ స్టేషన్ అని.. అంటూ రకరకాలుగా చెప్పారు.
ఎవరేం రీజన్ చెప్పినా.. అంతిమంగా తాము చర్చకు రాలేకపోతున్నామన్నది సమాధానం. ఈ ఊహించని పరిణామానికి కంగుతిన్న సదరు ఛానల్.. వచ్చినోళ్లతో బండి నడిపించారట. మామూలుగా అయితే.. సదరు ఛానల్ ఎండీ సీన్లోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద తలకాయలే దిగి వస్తాయి. ఇందుకు భిన్నంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద తలకాయలు ఎవరూ బాహాటంగా చర్చకు రావటానికి అస్సలు ఇష్టపడలేదట.
చర్చకు వచ్చిన తర్వాత తమ నోటి నుంచి వచ్చే మాటతో లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాయన్న సందేహాన్ని ఆఫ్ ద రికార్డుగా కొందరు వ్యక్తం చేస్తే.. మరికొందరు మాత్రం తమకు అనారోగ్యంగా ఉందని చెప్పేశారట. చర్చకు ముందురోజు రాత్రి సైతం కన్ఫర్మ్ గా వస్తామని చెప్పినోళ్లు తెల్లారేసరికి ఈ తీరులో హ్యాండ్ ఇవ్వటాన్ని ఊహించని ఛానల్ సిబ్బంది అవాక్కు అయ్యారట. ఛానల్ యజమాని ముందు తెగ హైరానా పడ్డారట. అయితే.. ఇలాంటి ఇబ్బందులు తెలిసిన సదరు ఛానల్ యజమాని ప్రముఖుల గైర్హాజరీని పాత్రికేయుల పనితీరులో తప్పిదం కింద వేయకపోవటం కాస్తంత రిలీఫ్ అయిన అంశం.
ఇదిలా ఉంటే..మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారీ చర్చకు హ్యాండ్ ఇచ్చిన వాళ్లలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు.. సూటిగా ఏదైనా మాట్లాడేస్తాం.. ఏం చేస్తారంటూ తనదైన ఊతపదంతో విరుచుకుపడే వారు మొదలు.. బోల్డ్ గా మాట్లాడటానికే తాను ఉన్నట్లుగా వ్యవహరించేవారు.. ఇండస్ట్రీ మీద తరచూ తీర్పులు ఇచ్చేస్తూ.. ప్రత్యేకమైన వెబ్ వీడియోల్ని షూట్ చేయించే వారెందరో ఉన్నారట. తెర మీదా.. తెర వెనుకా మొనగాళ్లుగా.. ఇండస్ట్రీకి పెద్దోళ్లమన్న చాలామంది చర్చకు చివరి క్షణంలో హ్యాండ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది