అమెరికా నెక్స్ట్ ప్రెసిడెంట్ కిమ్‌ కర్దాషియాన్‌!

Update: 2016-11-10 07:20 GMT
సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ, అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం నమోదు చేసి, నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సమయం లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి సెలబ్రెటీల వరకు ముఖ్యంగా హాలీవుడ్ స్టార్స్ దాదాపుగా డెమోక్రటిక్‌ అభ్యర్ధి హిల్లరీకే మద్దతు పలికారు. ట్రంప్ వద్దు హిల్లరీ ముద్దు అని, ఆమే అధ్యక్షురాలు అవుతుందని అనుకున్నారు. కానీ అందరినీ షాక్‌ కు గురిచేస్తూ వైట్‌ హౌస్‌ లో ట్రంప్‌ అడుగుపెట్టనున్నారు. దీంతో హాలీవుడ్ జనాలు కొంతమంది భయపడగా మరికొంతమంది వెటకారపు కామెంట్‌స్ చేస్తున్నారు!

"అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ని ఎన్నికయ్యారు. నెక్స్ట్ 46వ అధ్యక్ష పదవికి టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌ ను ఎన్నుకుంటారేమో" అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. "15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాను కానీ... ఈ స్థాయిలో ఎప్పుడూ భయపడింది లేదు" అంటూ  ఇమ్మిగ్రెంట్‌ అంటూ ఇండో-అమెరికన్‌ నటుడు కునాల్‌ నయ్యర్‌ ట్వీట్‌ చేశారు. ఇదే క్రమంలో పాప్‌ స్టార్లు ఆరియానా గ్రాండే, టీవీ హోస్ట్‌ ఎల్లెన్‌ - లేడీ గాగా తదితర సెలబ్రెటీలు ట్రంప్‌ విజయంమై సోషల్‌ మీడియా ద్వారా వెటకారమాడారు, నిరసన వ్యక్తం చేశారు.

అలాగే, "ట్రంప్ నిజంగానే ఈ విజయం సాధించాడు? అమెరికాలో ఆ రాత్రిని మించిన హాస్యం మరొకటి లేదు" అని ఖెర్ అనే మ్యూజిక్ ఆర్టిస్టు స్పందించాడు. ముస్లింలు - వలసదారులు - మహిళలు - ఎల్జీబీటీ కమ్యునిటీ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, భవిష్యత్తులో వారి తరుపున పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జెస్సీ టైలర్ ఫెర్గూసన్ అనే నటుడు తెలిపాడు. "ఇది అమెరికాకు చాలా కలవరాన్ని పుట్టించిన రాత్రి" అని క్రిస్ ఇవాన్స్ అనే హాలీవుడ్ నటుడు ట్వీటాడు! ఈ రేంజ్ లో ట్రంప్ విజయంపై హాలీవుడ్ నటులు వెటకారమాడుతున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News