భారత్ లో బయటపడిన కరోనా వైరస్ బి1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) ఆందోళనకరమైన స్ట్రెయిన్ గా వర్గీకరించిందంటూ నిన్నటి నుంచి తెగ ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్రప్రభుత్వం తాజాగా స్పందించింది.బి-1617.. భారత్ రకం స్ట్రెయిన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడా వెల్లడించలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.మీడియా సంస్థలే దీనిపై ప్రజలను భయాందోళనకు గురిచేసేలా కథనాలు అల్లుతున్నాయని పేర్కొంది.
బి-1.617ను 'భారత వేరియంట్' అని డబ్ల్యూ.హెచ్.వో ఎక్కడా పేర్కొనలేదని కేంద్రం తెలిపింది. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవే కాక అవాస్తమని కొట్టిపారేసింది. . బి.1.617ను భారత రకం స్ట్రెయిన్ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదు. కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా 'భారత్' అనే పదం లేదు''అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
అయితే డబ్ల్యూ.హెచ్.వో కోవిడ్ విభాగా సాంకేతిక నిపుణురాలు డా. మారియా మాత్రం బీ1617 స్ట్రెయిన్ ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. భారత్ లో వెలుగుచూసిన ఈ వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.