లాలూ ప్రసాద్ యాదవ్ ను కేంద్రం వదలడం లేదే?

Update: 2022-02-15 15:46 GMT
వృద్ధాప్యంతో ముదిమి వయసులో బాధపడుతున్నా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ను కేంద్రం వదిలిపెట్టడం లేదు. పాత కేసులన్నీ తిరిగి తోడి ఆయనకు శ్రీకృష్ణ జన్మస్థానానికే పంపిస్తోంది. తాజాగా దాణా కుంభకోణం కేసులో బీహార్ సీనియర్ రాజకీయ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ వదలడం లేదు.  సీబీఐ కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను కోర్టు దోషిగా ప్రకటించింది. ఈ మొత్తం కేసు 1990,1995 మధ్యకాలంలో  డోరాండా ట్రెజరీ నుంచి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంతా విత్ డ్రా చేయడంపై ఉంది.

ఇది దాణా కుంభకోణంలో ఐదో కేసు మాత్రమే కాకుండా అతిపెద్ద కేసు కూడా.. తాజా తీర్పుతో పశుగ్రాసం కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు.

తీర్పు సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని కోర్టుకు హాజరయ్యారు. ఆయనను దోషఇగా కోర్టు తేల్చింది.  నడవలేక వృద్ధాప్యంతో బాధపడుతున్నట్టు కనిపించారు.

ఈ కేసులో 98 మంది ఇతర నిందితులు సైతం కోర్టుకు హాజరయ్యారు. వీరిలో 24 మందిని నిర్ధోషులుగా కోర్టు తీర్పు చెప్పింది. తక్కిన వారిలో 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

వీరిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధృవ్ భగత్ ఉన్నారు. కాగా ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన లాలూ సహా 39 మంది శిక్షాకాలాన్ని ఈనెల 21న కోర్టు ప్రకటించనుంది.

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి నాలుగు కేసుల్లో ఇప్పటికే లాలూ దోషిగా నిర్ధారణ అయ్యింది. మొదటి కేసులో లాలూకు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. రెండో కేసులో మూడున్నరేళ్ల శిక్ష, మూడో కేసులో 5 ఏళ్ల శిక్ష, నాలుగో కేసులో 7 ఏళ్ల శిక్ష పడింది.

తాజాగా ఐదో కేసును కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. హైకోర్టు నుంచి గతంలో బెయిల్ పొందిన లాలూ ప్రస్తుతం జైలు నుంచి బయటకు వచ్చారు.
Tags:    

Similar News