ఎన్నికల సంస్కరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది. ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ లింక్ చేయడంపై ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన ప్రభత్వం అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. నకిలీ ఓటర్లను తొలగించే దిశలో భాగంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఓటు హక్కు నమోదు చేసుకునే సమయంలో ఆధార్ వివరాలను కూడా జోడించాలని తెలిపింది. దీంతో ఒక వ్యక్తికి ఒక ఓటు కంటే ఎక్కువ ఓట్లు వేయడానికి వీలుండదు. దీంతో దొంగ ఓట్లను నివారించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.స
ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై ఈ బిల్లును ఆమోదించింది. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు తప్పని చేయాలని సూచించింది. ఓటు హక్కు రిజిస్ట్రేషన్ ను సమ్మిళితం చేయడం, ఎన్నికల కమిషన్ కు మరిన్ని అధికారాలు కల్పించడం, డూప్లికేట్ ఓటును నివారించేలా సంస్కరణలు తీసుకొస్తున్నట్లు మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ఆధార్, ఓటర్ ఐడీతో లింక్ చేయనున్నారు. అయితే ఇది వాలంటరీ బేసిస్ లో ఉంటుందని కేబినెట్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఫైలట్ ప్రాజెక్టను ఏర్పాటు చేయనుంది.
కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోకునే వారికి మరిన్ని సులువు అవకాశాలు ఇచ్చింది ఏడాదికి నాలుగుసార్లు ఓటు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక సర్వీసు ఆఫీసర్ల భార్యలకు మాత్రమే ఉన్న పోస్టల్ బ్యాలెట్ హక్కును జెండర్ న్యూట్రల్ గా మార్చింది. కొత్త రూల్ ప్రకారం మహిళా సర్వీసు ఆఫీసర్ల భర్తలు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏ బిల్డింగులోనైనా ఓటింగ్ నిర్వహించే అధికారి కేబినెట్ ఎలక్షన్ కమిషన్ కు కట్టబెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలతో సోమవారం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
గతంలో ఓటర్ ఐడీ, ఆధార్ లింక్ ను నిర్బంధంగా చేయగా.. తాజా బిల్లుతో స్వచ్ఛందంగా చేయనున్నారు. ఓటర్ల జాబితాను మెరుగు పరచడానికి, ఓటింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి కేంద్ర ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. గత కొన్నేళ్లును నకిలీ ఓట్లపై అనేక ఆరోపణలున్నాయి. ఎంత టెక్నాలజీ వాడినా ఈ సమస్య తొలిగిపోలేదు. దీంతో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిన తరువాత దానిని చట్టంగా మార్చే అవకాశం ఉంది.