షాపు కావొచ్చు.. సూపర్ మార్కెట్ కావొచ్చు.. ప్రతి నెలా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొనుగోలు చేసే వస్తువుల్లో అత్యంత ముఖ్యమైనదిగా వంట ఆయిల్ ను చెప్పాలి. దీన్ని అమ్మేందుకు ఆయా కంపెనీలు అనుసరించే విధానాలతో పాటు.. చేసే మోసాలపై ప్రజలకు అవగాహన చాలా ముఖ్యం. చాలామంది తాము కొనుగోలు చేసే షాపు మీద నమ్మకంతో చాలా వస్తువుల్ని గుడ్డిగా కొనేస్తుంటారు. ఎవరైనా ముందుకు వచ్చి.. మోసపోయే విధానాల్ని చెబుతుంటే.. మరింత శ్రద్ధతో వినాల్సిన అవసరం ఉంది.
తాజాగా కేంద్రం కొత్త ఆదేశాల్ని జారీ చేసింది. దీని ప్రకారం.. ఆయిల్ పాకెట్ల తీరు తెన్నులు మార్చేయటంతో పాటు.. లేబులింగ్ లో ఏం పేర్కొనాలి? మరేం వద్దు? అనే విషయంపై స్పష్టత ఇవ్వటంతో పాటు.. తమ ఆదేశాల్ని అమలు చేసేందుకు వచ్చే ఏడాది జనవరి15 వరకు టైమిచ్చింది. ఎందుకంటే.. పలు కంపెనీలు పాకెట్లకు సంబంధించి భారీగా సమాచారాన్ని ప్రింట్ చేసి ఉంటాయి. వాటి స్టాక్ ఎక్కువగాఉంటాయి. అందుకే కావాల్సినంత గడువు కంపెనీలకు ఇచ్చింది.
సాధారణంగా ఆయిల్ కంపెనీలు తాము అమ్మే పాకెట్లకు సంబంధించి నికర బరువు ఎంత? అన్నది పక్కన పెట్టి.. ఫలానా ఉష్ణోగ్రత వద్ద ఆయిల్ ను ప్యాక్ చేసినట్లుగా పేర్కొంటారు. సాధారణంగా ఒక కేజీ అంటే వెయ్యి గ్రాములు ఉంటాయి.
ఒక లీటర్ అంటే 91.6 గ్రాముల బరువును చూపిస్తారు. కొన్నిఆయిల్ కంపెనీలు తమ వెయిట్ ను చెప్పకుండా 60 డిగ్రీల్లో ఉన్నప్పుడు ప్యాక్ చేసినట్లు చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇక్కడే అసలు మాయ ఉందని చెబుతున్నారు.
సాధారణంగా వంట నూనెల్లని 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాక్ చేయాలి. ఒకవేళ ఆయిల్ పాకెట్లను 21 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాక్ చేస్తే 919 గ్రాములు వస్తాయి. అదే 60 డిగ్రీల వద్ద హీట్ చేస్తే 892.6 గ్రాములుగా నమోదవుతుందని చెబుతున్నారు. సో.. గ్రాముల్లో నూనెను కొనుగోలు చేయటమే బెటర్.
అంతే తప్పించి ఫలానా టెంపరేచర్ దగ్గర హీట్ చేసినట్లు చెప్పి.. ప్యాక్ చేశారంటూ పేర్కొనే ఆయిల్ పాకెట్ ను అస్సలు కొనకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా గ్రాముల్లో మాత్రమే పొందుపర్చి నూనెల పాకెట్లను అమ్మాలని కేంద్రం చెప్పటం ద్వారా.. మోసాలకు చెక్ చెప్పే వీలుందన్న మాట వినిపిస్తోంది.