వైసీపీ కలకు కేంద్రం వ‌త్తాసట!

Update: 2022-07-18 05:30 GMT
వైసీపీకి మూడు రాజధానుల కల మళ్లీ వచ్చింది. ఈసారి కేంద్రం వత్తాసు ఉందట. రాష్ట్రపతి ఓటుకు రిటర్న్ గిఫ్టుగా మూడు రాజధానులు రాబోతున్నాయని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. వాస్తవానికి 3 రాజ‌ధానుల అన్న క‌ల ఇప్ప‌టికి ఎలా ఉందో తెలుసు. రేప‌టి వేళ ఎలా ఉండ‌నుందో కూడా తెలుసుకుంటే మేలు.

కాసేపు మూడు రాజధానులు పక్కన పెట్టి వాస్తవ ఆంధ్రను చూడమంటున్నారు ప్రజలు. ఒక్క‌సారి భీమ‌వరంలో మార్టేరు బ‌స్టాండు, పులివెందులలో ఆర్టీసీ బస్టాండు... అమలాపురం సెంటర్ రోడ్డు... చూసి రండి అపుడు ఏ కల కనాలో అర్థమవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బస్టాండు కట్టలేక తాటాకుల కింద ప్రజలను నిలబెట్టి... నగరాలు కడతామంటారా అని నిలదీస్తున్నారు. ఇంతకీ ఇపుడీ చర్చ ఎందుకు వచ్చిందంటే..  తాజాగా  3 రాజ‌ధానుల‌ను ఓకే చేయించుకుంది అని, కేంద్రం అందుకు స‌మ్మ‌తి ఇస్తోంద‌ని అంటున్నారు. సడెన్ గా కేంద్రం ఎందుకలా అంటోంది అంటే.... ద్రౌపది గారికి ఓటేశాం కదా అంటోంది వైసీపీ వర్గం.

కానీ ఇటీవలే అమిత్ షా ఆంధ్రాకు వచ్చినప్పటి నుంచి అమరావతికి బీజేపీ జైకొడుతున్న విషయాన్ని వైసీపీ నేతలు మరిచిపోతున్నారు. అది కూడా పక్కన పెట్టినా... ఇంత‌వ‌ర‌కూ రాజ‌ధాని కోసం నోటిఫై చేసిన భూములు ఏమౌతాయి.

అస‌లు రాజ‌ధాని కోసం త్యాగం చేసిన రైతులు ఏమౌతారు ? ఇవి ప‌ట్టించుకోకుండా కేవ‌లం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో భాగంగానే వైసీపీ ఏం చెబితే అది కేంద్రం ఓకే చేసింద‌ని ఎలా అనుకోగ‌లం. అది జర‌గ‌ని ప‌ని. గ‌తం లోనూ ఇదే విధంగా హోదా విషయ‌మై కేంద్రం మాట ఇచ్చి త‌ప్పింది. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌నుంది అని అంటోంది టీడీపీ.

మరో చిక్కు ఏంటంటే....  క‌ర్నూలు కేంద్రంగా కోర్టు ఏర్పాటును వాళ్లు అక్క‌డ స్వాగ‌తిస్తున్నారా లేదా అన్న‌ది అటుంచితే అది న్యాయ‌ప‌రంగా చాలా పెద్ద చిక్కే ! రాష్ట్ర‌ప‌తి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అనుకున్నంత ఈజీ కూడా కాదు.

అయినా క‌ర్నూలులో కోర్టు ఏర్పాటు అయినా ఆ విష‌యం పార్టీల‌కు రాజ‌కీయ ల‌బ్ధి ఇచ్చే విష‌యం అంత కన్నా కాదు. ఎందుకంటే ఇప్ప‌టిదాకా సీమ ప్రాంతంలో ప్రాజె క్టులు వ‌ర‌ద‌ల కార‌ణంగా కొట్టుకుపోయిన గేట్లు వాటి ఏర్పాటు ఇలాంటి వాటిపైనే వైసీపీ దృష్టి సారించ‌లేద‌న్న వాద‌నలు ఉన్నాయి. రాయలసీమకైనా, ఉత్తరాంధ్రకైనా తమ పొలంలో పారే నీరు కావాలి గాని తమకు కోర్టులు, రాజధానులతో పనిలేదంటున్నారు. వైసీపీ నేతలు నిజమయ్యే కలలు కంటే మంచిది అని చురకలు వేస్తున్నాయి ప్రతిపక్షాలు.
Tags:    

Similar News