కృష్ణా నది పై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు మినహా మిగిలినవి బోర్డు పరిధిలో అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ వాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధి లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల, వెలిగోడు, గోరకల్లు, అవుకు రిజర్వాయరు సహా అన్నీ బోర్డు పరిధిలో ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి కేంద్రం తాజాగా లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధి లో ఉండాల్సిందేనని కేంద్ర జల శక్తి శాఖ స్పష్టం చేసింది.
బోర్డు పరిధి పై ఏపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు అంశాల వారీగా సమాధానం ఇచ్చిన కేంద్రం… దేనితో నూ ఏకీభవించలేదు. పూర్తిగా బోర్డు పరిధి లో ఉండే షెడ్యూలు-2లో ప్రధాన ప్రాజెక్టులైన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఉంటే చాలనడం సరికాదని.. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ.. బోర్డుల పరిధిలో ఉండాలని తేల్చి చెప్పింది. శ్రీశైలం నీటి నిల్వలు తగ్గినపుడు పోతిరెడ్డిపాడు కాకుండా వెలిగోడు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, గోరకల్లు, అవుకు ఇవన్నీ ముఖ్యమని అన్నీ బోర్డు పరిధిలో ఉండాల్సిందేనని పేర్కొంది.
ప్రాజెక్టుల పేర్లు పునర్విభజన చట్టంలో ఉన్నట్లే బోర్డు పరిధి నోటిఫికేషన్‌లో చేర్చామని... వీటిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. గాలేరు-నగరి, సిద్దాపురం ఎత్తిపోతల , కోయిల్‌సాగర్‌కు సంబంధించిన ఫిర్యాదు పైనా స్పందించింది. తుంగభద్ర కుడిగట్టు దిగువ, ఎగువ కాలువలు తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నందున వీటిని కృష్ణా బోర్డు పరిధి నుంచి తొలగించాలన్న ప్రతిపాదనకూ అంగీకరించలేదు.
భైరవానితిప్ప, గురురాఘవేంద్ర, గాజులదిన్నె విషయం లోనూ ఏపీ అభిప్రాయంతో విభేదించింది. మునేరు ప్రాజెక్టు ఆనకట్ట పురాతనమైందని, బచావత్ ట్రైబ్యునల్ 3.3 టీఎంసీలు కేటాయించిందని కాబట్టి దీన్ని ఆమోదం లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని కోరగా... రిజర్వాయర్ ఎక్కువగా తెలంగాణలో ఉన్నందున అంతర్రాష్ట్ర సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది ఆమోదం లేనిదేనని సమాధానమిచ్చింది. పోలవరం కుడి కాలువకు, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధం లేనందున దీన్ని నోటిఫికేషన్ నుంచి తొలగించాలని ఏపీ కోరగా.. పోలవరం డీపీఆర్ ప్రకారం కుడికాలువ నుంచి సాగర్ ఎడమకాలువ చివరి ఆయకట్టుకు నీరందుతుందని.. అందుకే చేర్చినట్లు వివరించింది.
కృష్ణా పై ప్రకాశం బ్యారేజీ, గోదావరి పై ధవళేశ్వరం బ్యారేజీల వద్ద వచ్చే నీటిని.. విడుదల చేసే నీటిని రికార్డు చేయడమే కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్ యాజమాన్యంలో ఉండేలా మార్చాలన్న సూచనకు అంగీకరించలేదు. వైకుంఠాపురం పంపింగ్ స్కీంకు బచావత్ ట్రైబ్యునల్ 2.6 టీఎంసీలు కేటాయించిందని, ఇందులో 0.6 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి పునఃకేటాయించారని ఈ పథకం అమరావతి తాగు నీటి అవసరాలు తీరుస్తున్నందున షెడ్యూలు-1, 3 లో చేర్చాలని ఏపీ కోరగా దాన్నీ కేంద్రం తిరస్కరించింది. మొత్తంగా అన్ని విజ్ఞాపనలనూ కేంద్రం తోసిపుచ్చింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.