ఏపీలోని కొత్త జిల్లాలకు కేంద్రం కోడ్ లు వచ్చేశాయ్

Update: 2022-04-06 11:40 GMT
ఏపీలో ఉన్న జిల్లాలకు అదనంగా కొత్త జిల్లాల్ని జగన్ సర్కారు ఏర్పాటు చేయటం తెలిసిందే. గతంలో ఉన్న 13 జిల్లాలకు బదులుగా మరో 13 కొత్త జిల్లాలతో మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయా జిల్లాలకు  కేంద్రం కోడ్ లు కేటాయించాల్సి ఉంటుంది. లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీగా వ్యవహరించే ఈ కోడ్ లతో పాలనా సౌలభ్యం ఉంటుంది.

ఈ కోడ్ లతోనే కేంద్రం రాష్ట్రంలోని జిల్లాలతో పాలనా పరమైన సంప్రదింపులు.. వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులతో పాటు.. నిధుల పంపిణీతో పాటు.. మరిన్ని అంశాలకు ఈ కోడ్ లను వినియోగిస్తారు. తాజాగా ఏర్పాటైన 13 కొత్త జిల్లాలకు వరుస కోడ్ లను కేటాయించారు. ఆ కోడ్ లు ఇలా ఉన్నాయి. పాత జిల్లాలకు మాత్రం గతంలో కేటాయించిన కోడ్ లు కంటిన్యూ కానున్నాయి.

1. పార్వతీపురం మన్యం జిల్లాకు 743
2. అనకాపల్లికి 744
3. అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745
4. కాకినాడకు 746
5. కోనసీమకు 747
6. ఏలూరుకు 748
7. ఎన్టీఆర్ జిల్లాకు 749
8. బాపట్లకు 750
9. పల్నాడుకు 751
10. తిరుపతికి 752
11. అన్నమయ్య జిల్లాకు 753
12. శ్రీ సత్యసాయి జిల్లాకు 754
13. నంద్యాలకు 755
Tags:    

Similar News