దేశంలో కరోనా క్రమ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ..కరోనా పై రోజుకో వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా 3 స్టేజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దానిపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. భారత్ లో కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకడం తక్కువ పరిధిలో ప్రారంభమైందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ డాక్యుమెంట్ చెబుతోంది. దేశం మొదటిసారిగా సంక్రమణ చెందుతున్న దశలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్యశాఖ అంగీకరించింది.
ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి నాలుగు ముఖ్యదశలు ఉంటాయి. స్టేజ్-1 ఏంటంటే - కేసులు బయట నుంచి వచ్చినవి - స్థానికంగా వచ్చిన కేసులు కాదు. స్టేజ్-2 ఏంటంటే లోకల్ ట్రాన్స్ మిషన్...అంటే వైరస్ పాజిటివ్ తేలిన ఓ సెక్షన్ వ్యక్తులు... ట్రావెల్ హిస్టరీ (విదేశాలు లేదా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారావడం) ఉన్న కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ తో సంబంధం కలిగి ఉండటం. స్టేజ్-3ఏంటంటే... కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్. స్టేజ్-4 ఏంటంటే.. ఒక అంటువ్యాధి సంక్రమణ మూలం గుర్తించబడనప్పుడు మరియు రోగికి ప్రయాణ చరిత్ర లేనప్పుడు లేదా ధృవీకరించబడిన కరోనా సోకిన వ్యక్తితో తెలిసిన పరిచయం లేనప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరుగుతుంది. నిర్ధారణ చేయని కేసులు ఇతరులకు సోకుతున్నాయని ఇది సూచిస్తుంది.
దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని వివిధ లొకేషన్లలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరిగిందని - కానీ ఇప్పుడు గుర్తించలేని సంక్రమణ ఉన్నవారి సంఖ్య పెరుగుతోందని ఇది కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ప్రారంభమైనదని చెప్పడానికి ఓ సంకేతమని ఓ సీనియర్ ప్రజారోగ్య నిపుణుడు తెలిపారు. భారత్ లో ఇప్పటివరకు 1071కరోనా కేసులు 29మరణాలు నమోదయ్యాయి.