వలస కూలీలకు కేంద్రం వరం

Update: 2020-06-08 11:30 GMT
వలస కూలీలంతా సొంతూళ్లకు చేరారు. ఇన్నాళ్లు ఉపాధి కోసం పలు రాష్ట్రాలు దాటి నగరాల్లో ఉపాధి పొందిన వారు పనిలేక పైసలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. నెలరోజుల నుంచి వలస వచ్చిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మేరకు కేంద్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కమిటీ వేసింది.

మరో రెండు రోజుల్లో కమిటీ నివేదిక అందజేయనుంది. సొంత గ్రామాలకు వచ్చిన కూలీల నైపుణ్యం ఆధారంగా పని కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం కూడా ఈ మినిస్టర్స్ తీసుకోనున్నారు.

వలస కూలీలకు ఉపాధి కల్పించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 116 జిల్లాల్లో వలస కూలీలు ఉన్నారని గుర్తించింది. ఆ జిల్లాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో బీహార్ లోని 32 జిల్లాలు ఉన్నాయి.

బీహార్ తర్వాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 31 జిల్లాలు, మధ్యప్రదేశ్ లో 24, రాజస్థాన్ లో 22, ఒడిషాలో 4, జార్ఞండ్ లో 3 జిల్లాలున్నాయి. వీరిందరికి పునరావాసం కల్పించి ఉపాధి అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమవుతోంది.
Tags:    

Similar News