కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలని సెప్టెంబర్ 14 నుండి కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రకటించిన కేంద్రం .. తాజాగా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ,పలువురు ఎంపీలు కూడా కరోనా భారిన పడుతుండటంతో సమావేశాలని కుదించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు లోక్ సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు కరోనా కాటుకి బలైయ్యారు. దాంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సెషన్‌ను కుదించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దాదాపు 30 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ప్రాంగణం వద్ద అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం పునరాలోచనలో పడింది. సమావేశాల రోజులను కుదించే యోచనలో కేంద్రం ఉందని పార్లమెంట్ అధికారులు చెపుతున్నారు. ప్రతి రోజు 90 వేలకు పైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. గురు, శుక్రశని వారాల్లో వరుసగా 95 వేలు, 96 వేల ,93 వేల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడుతున్న పార్లమెంటు సభ్యుల సంఖ్య కూడా పెరుగుతోంది.
దీనితో సమావేశాలని కుదించాలని అనుకుంటున్నారట. దీనిపై ప్రస్తుతం పలు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించే పనిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది చేపట్టినట్లు సమాచారం. దీనితో సోమవారం లోపు ఓ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.