దేశంలో మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మరిని అరికట్టడానికి ఎన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఏప్రిల్ 21 నాటికి ఈ దేశంలో ఈ వైరస్ కేసులు 18,985 మాత్రమే ఉండగా.. మే 20 నాటికి లక్షా ఆరువేల 750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. మెల్లగా గ్లోబల్ సినేరియో లో ఇండియా కూడా ఈ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారుతోంది.
మే నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ తేదీ నుంచి ఇది సుమారు మూడున్నర వేలకు పెరగగా, గత నాలుగు రోజుల్లో రోజుకు 4,950 కేసులకు పెరిగింది. ఇక ఒక్క బుధవారం రోజే కొత్తగా 5,611 కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో ఈ మహమ్మారి విజృంబిస్తున్నప్పటికీ.. ఈ పరిస్థితిని ఎలా అధిగమిద్దామని గానీ, వైరస్ ఎలా కట్టడి చేద్దామని గానీ కేంద్రం నుంచి క్లారిటీ లేదు.
గతంలో రోజూ ప్రెస్ బ్రీఫింగులు నిర్వహించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. గత 8రోజులుగా వీటికి స్వస్తి చెప్పింది. చివరిసారి ఈ నెల 11 న హెల్త్ మినిస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అయితే, రోజు మీడియాతో ఇంటరాక్షన్ ని ఎందుకు విరమించుకుందో అర్థం కాని పరిస్థితి అన్న విమర్శలు వస్తున్నాయి.అలాగే లాక్ డౌన్ అనే మాట విని విని అందరూ దానికి అలవాటుపడిపోతున్నారు. మొత్తంగా ఇకపై కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని పదే పదే నేతల వ్యాఖ్యలు చేయడంతో ఈ శాఖకి కూడా ఆ నేతల మాటలు రుచించినట్టు ఉన్నాయేమో