ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? లక్ష కోట్లు అనే వారు కొందరైతే.. మరికొందరు రూ.3లక్షల కోట్లు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.3 నుంచి రూ.4లక్షల కోట్లు కావాలని చెబుతారు.
మరి.. అమరావతి కోసం కేంద్రం ఎంత ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని ఇప్పటివరకూ స్పష్టం చేసింది లేదు. అసలు.. కేంద్రం దృష్టిలో అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని భావిస్తోందన్న విషయం మీద కూడా ఇప్పటివరకూ నోరు విప్పింది లేదు. తాజాగా.. అమరావతి నగర నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాను కేంద్రాన్ని ప్రశ్న రూపంలో వేశారు.
దీనికి సమాధానం చెప్పిన కేంద్రం.. అమరావతి నిర్మాణం కోసం అయ్యే ఖర్చు రూ.27,097 కోట్లుగా అంచనా వేసింది. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తుందంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్రం బదులిచ్చింది. ఇప్పటికే అమరావతి కోసం కేంద్రం రూ.1850కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో. కేంద్రం నుంచి అమరావతికి వచ్చేది చిల్లర డబ్బులేనని తాజా లెక్కతో తేలిపోయినట్లే.
కేంద్రం లెక్కలో అమరావతి నిర్మాణానికి వేసిన ఖర్చుల లెక్క చూస్తే..
= నిర్మాణాలకు; రూ.10,519 కోట్లు
= రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు ; రూ.1,596 కోట్లు
= రాజధాని నగరంలో మౌలిక వసతుల కల్పన ; రూ.5,861 కోట్లు
= మౌలిక సదుపాయాల వృద్ధి విస్తరణకు ; రూ.9,181 కోట్లు