పాత చర్చే. కానీ కొత్త రూపంలో తెరమీదకు వచ్చింది. అదే బీజేపీ-టీఆర్ ఎస్ ల మధ్య దోస్తీ!. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీతో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న టీఆర్ ఎస్ పార్టీకి సంబంధాలు బాగానే ఉన్నట్లు, ఇచ్చిపుచ్చుకునే దోరణిలో ఆ రెండు అధికార పార్టీలు ముందుకుపోతున్నాయని తెలుస్తోంది.ఈ పద్ధతిలోనే రాజకీయాలు నడుస్తున్నాయన్నది తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ - ఇతర ప్రతిపక్షాలు తప్పుపడుతున్న తెలంగాణ భూ సేకరణ చట్టం అంశానికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవడం ఇందుకు నిదర్శనంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన తెలంగాణ భూ సేకరణ చట్టం బిల్లుకు కొన్ని సవరణలు చేసి పంపిస్తే ఆమోదిస్తామని ఇటీవల కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియజేశారు. దాని ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి, బిల్లుకు చట్ట సవరణ చేశారు. అయితే సస్పెన్షన్ ఆధారంగా తమను సభలోకి రానివ్వకపోవడంతో గవర్నర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో భూసేకరణ బిల్లును ప్రస్తావించకుండా, తమను ఆహ్వానించకపోవడంపైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే..పేరుకే పైపై విమర్శలు చేసుకుంటున్నారే తప్ప అంతా ఓకే అనే భావన ఉందని అంటున్నారు. మరోవైపు 2013 భూ సేకరణ చట్టానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. బిల్లును యథాతథంగా అమలు చేయనీయకుండా ఆయా రాష్ట్రాలు సొంతంగా మార్చుకునేలా వెసులుబాటు కల్పించింది. దాని ఆధారంగా ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా టీఆర్ ఎస్ వంటి మిత్రపక్షాలు కాని రాష్ర్టాలు కూడా సవరణలు చేసుకుంటుడటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/