గతానికి భిన్నంగా సోషల్ మీడియా స్పీడ్ కు చెక్ పెట్టేలా కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శ ఇప్పుడు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మోడీ సర్కారు తీసుకొచ్చిన సరికొత్త నియమావళి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ కేంద్రం తెచ్చిన కొత్త నియమావళిలో ఏముంది? సోషల్ మీడియా సంస్థలకు ఈ నిబంధనలు ఎందుకు మింగుడు పడటం లేదు? అన్నది ప్రశ్నగా మారింది.
కొత్త నియమావళి విషయానికి వస్తే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే తీరుకు చెక్ పెట్టటమే తమ ఉద్దేశంగా చెబుతున్నారు. డిజిటల్ మీడియా పారదర్శకత పెంచేందుకే తాము కొత్త నియమాళిని తీసుకొచ్చినట్లుగా చెబుతోంది. తాము తెచ్చిన కొత్త నిబంధనల్ని అమలు చేయటానికి మూడు నెలల గడువు కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ నిబంధనలు ఏమిటన్న విషయానికి వస్తే..
- సోషల్ మీడియాలోని అన్ని సంస్థలు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఒక అధికారిని నియమించాలి
- సదరు అధికారి పేరు.. కాంటాక్టు వివరాలు అందుబాటులోకి ఉంచాలి
- ఫిర్యాదు అందిన 24 గంటల్లో అధికారి ఆ విషయాన్ని వారికి తెలపాలి
- ఫిర్యాదును పదిహేను రోజుల్లో పరిష్కరించాలి.
- మహిళా యూజర్ల ఆన్ లైన్ భద్రత.. గౌరవాన్ని కాపాడాలి
- మహిళల నుంచి కంప్లైంట్లు వస్తే 24 గంటల్లోగా వారిని ఇబ్బంది పెట్టే కంటెంట్ ను డిలీట్ చేయాలి
- మహిళల రహస్య అవయువాలను బహిర్గతం చేసే ఫోటోల్ని వెంటనే తొలగించాలి (ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపు)
- పోలీసులు.. సీబీఐ వంటి సంస్థలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా నోడల్ అధికారిని నియమించాలి
- కంప్లైంట్ పరిష్కారం కోసం రెసిడెంట్ గ్రీవన్స్ అధికారిని నియమించాలి
- ఇలా నియమించే వారంతా భారత్ లో నివసించే వారై ఉండాలి
నిజానికి ఈ నిబంధనల్ని చూస్తే.. ఇందులో తప్పు ఉన్నట్లు అనిపించదు. వాస్తవానికి ఫేస్ బుక్.. ట్విటర్ కు సంబంధించిన ఏదైనా కంప్లైంట్ వస్తే ఎవరిని సంప్రదించాలన్నది పెద్ద ప్రశ్న. అదో మాయాజాలంగా ఉంటుందని.. ఎవరు ఫిర్యాదులకు సంబంధించిన బాధ్యత తీసుకోరని పోలీసు ఉన్నతాధికారులు తరచూ వాపోతుంటారు. రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియా సంస్థల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో కాపిటల్ హిల్ పై దాడి జరిగినప్పుడు ఆ కంటెంట్ ను బ్లాక్ చేసే విషయంలో వేగంగా స్పందించిన ట్విటర్.. భారత్ లో శాంతిభద్రతలకు భంగం కలిగించే కంటెంట్ ను బ్లాక్ చేయటంలో అంత వేగంగా రియాక్టు కావటం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. ట్విటర్ కు భారత్ కు పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారని.. ఆ సంస్థ కార్యకలాపాల్ని నిర్వహించటం ద్వారా గణనీయంగా సంపాదిస్తోందని.. అలాంటిది వినియోగదారులకు ఏమైనా కష్టం వస్తే.. వాటిని పరిష్కరించే అధికారి ఇక్కడే ఉండే వ్యక్తిని ఒకరిని నియమించాలని కోరుతోంది. తాము ఏర్పాటు చేసుకోమన్న వ్యవస్థ గురించి సదరు కంపెనీ సానుకూలంగా స్పందించటం లేదని వాదిస్తోంది. నిజమే.. ఇంత పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాల్ని చేపట్టిన సంస్థ.. ఏదైనా కంప్లైంట్ వస్తే స్పందించే బాధ్యుడ్ని ఏర్పాటు చేయకపోవటం ఏమిటి?