కోడిపందాల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌?

Update: 2016-01-13 09:02 GMT
ఆంధ్రుల పెద్ద‌పండుగ అయిన సంక్రాంతి మ‌రో రెండు రోజులు మాత్ర‌మే ఉంది. ఓవైపు కోర్టు ఆదేశాల మేర‌కు కోడి పందేల మీద నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. కోర్టుకు ఇచ్చిన మాట ప్ర‌కారం కోడి పందేల మీద ఆంక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లోను కోడి పందేలు జ‌ర‌గ‌కుండా చూడాల‌న్న ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో కోడి పందేల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వారికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలా ఉంటే.. త‌మిళ‌నాడులోని సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్లు విష‌యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిన నేప‌థ్యంలో.. అదే త‌ర‌హాలో ఏపీలో కోడి పందేల విష‌యంలోనూ అదే తీరులో వ్య‌వ‌హ‌రించాలంటూ ఏపీకి చెందిన పలువురు ప్ర‌జాప్ర‌తినిధులు కేంద్రాన్ని కోరారు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ప‌లువురు నేత‌లు.. ప్ర‌జాసంఘాల ప్ర‌తినిధులు కోడి పందేల విష‌యంలో కేంద్రం సానుకూలంగా స్పందించి.. ఆర్డినెన్స్ ను జారీ చేయాల‌ని కోరుతున్నారు. కోడి పందేల విష‌యంలో క‌లుగ‌జేసుకున్న ఏపీ బీజేపీనేత‌లు త‌మ ప‌ర‌ప‌తిని ఉప‌యోగించి గురువారం సాయంత్రం నాటికి కోడిపందేల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఆదేశాలు జారీ అయ్యేలా చూస్తార‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News