మళ్లీ పెంచేశారు..! 2022 అంట... వింటూ ఉంటే.. మరో పదేళ్లు పట్టేట్టుందే!
ఔను! ఏపీ ప్రజలు వింటూ ఉండాలే కానీ..కేంద్రం ఎన్ని వాయిదాలైనా వేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా కీలకమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు విషయంలో కావడం గమనార్హం. ఏమాట కామాట చెప్పాల్సి వస్తే.. చంద్రబాబు హయాంలో 2019 డిసెంబరు నాటికి గ్రావిటీ ద్వారా నీటిని ఇచ్చేస్తామని.. అప్పటి భారీ జలవనరుల మంత్రిగా ఉన్న గడ్కరీ ప్రకటించేశారు. దీంతో ఏపీ ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. పోనీ.. ఎన్నో గండాలు దాటుకుని పూర్తవుతుందిలే అనుకున్నారు. అది పూర్తికాలేదు. సరికదా.. చంద్రబాబు ప్రభుత్వం మారిపోయి.. జగన్ సర్కారువచ్చేసింది. ఈయన ఏకంగా 2021 అంటే.. ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసేస్తామని పదేపదే చెప్పారు.
దీంతో ప్రజలు ఇది కూడా వినేశారు. పోనీలే.. ఏవో ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉంటాయి అనుకున్నారు. అప్పటికైనా పూర్తవుతుంద ని.. పైగా.. మంత్రి అనిల్ కుమార్ అయితే.. నోరు పెద్దది చేసుకుని చెప్పేసరికి నమ్మేశారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటనే పాడుతోంది.అంతేకాదు.. కేంద్రంలోని జలశక్తి మంత్రి షెకావత్ కూడా కొన్నాళ్ల కిందట ఇదే మాట చెప్పారు. ఇంకేముంది.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి.. నీటిని పారిస్తామన్నారు. అయితే.. తాజాగా కేంద్రం మళ్లీ మాట మార్చేసింది. టైం పెంచేసింది.
పోలవరం ప్రాజెక్టు పనులు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా వెల్లడించారు. 2020 నవంబరులో జరిగిన 13వ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి చేసే వ్యవధి లక్ష్యాన్ని సవరించినట్లు రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. తొలుత ప్రాజెక్టును 2021 డిసెంబరులో పూర్తి చేయాలని భావించినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుతం స్పిల్‌వే పనులను 2021మే నాటికి, రేడియల్ గేట్ల బిగింపు పనులను ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, కాఫర్ డామ్ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కటారియా తెలిపారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ గేప్-2 పనులు, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులతోపాటు.. భూ సేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపు ప్రక్రియను 2022 ఏప్రిల్ నాటికి నాటికి పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంటే.. అప్పటికి పూర్తయితే అయినట్టు లేకపోతే.. మళ్లీ గడువు పెంచేసినా.. వినేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉండాలన్న మాట!! ఇదీ.. పోలవరం సంగతి!!