ప్రభుత్వం అన్నాక వారి ఫోకస్ ప్రజాసంక్షేమమే అయి ఉండాలి. దానికి అడ్డు వచ్చినప్పుడు.. ఎలాంటి తీవ్ర నిర్ణయాలనైనా తీసుకుంటూ ఉండవచ్చు. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం ఎదగకుండా కూడా దృష్టిపెడుతుంది. అది వారి రాజకీయ అవసరం. ఇదంతా మామూలే ఈ రెండు రకాల ప్రయోజనాలూ కూడా లేకుండా, అలాంటి ప్రమేయం కూడా లేకుండా ప్రభుత్వం.. అనవసరపు రగడలకు దారితీసే చిల్లర నిర్ణయలు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకుంటే దానికేం చేయాలి. చిల్లర చికాకుల్ని పెంచుకుంటూ పోయే కొద్దీ.. ప్రజలు తమను అసహ్యించుకుంటారనే విషయాన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఇవాళ మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చిల్లర నిర్ణయాలతోనే ముందుకు సాగుతోంది.
ఇప్పటికే విద్యారంగం కాషాయీకరణ దిశగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడానికి వారు సిద్ధం అయిపోతున్న సంగతి తెలిసిందే. దానిని ప్రశ్నించే వారు లేకపోగా, పోస్టల తపాలా బిళ్లల్లో కూడా ఒక రకంగా కాషాయీకరణకు పాల్పడేలా కనిపిస్తున్నారు. కాషాయీకరణ సంగతి అటుంచితే.. ఇందిరాగాంధీ - రాజీవ్‌గాంధీ తపాలా బిళ్లలను తొలగించాలంటూ ప్రభుత్వం నిర్ణయించడం వివాదస్పదం అవుతోంది.
పార్టీలు ఏవైనప్పటికీ.. పాలకులుగా వారి మీద రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ.. ఈ దేశ నిర్మాణంలో ఇందిరాగాంధీ - రాజీవ్ గాంధీలు పోషించిన పాత్రను ఎవ్వరూ కాదనలేరు. అలాంటిది... ఆ ఇద్దరి బొమ్మలతో విడుదలైన పోస్టల్ స్టాంపులను కూడా రద్దు చేసేయాలని మోడీ సర్కారు తెగించడం చాలా అనైతికంగా కనిపిస్తోంది. పోస్టల్ శాఖ వారి 'నవభారత నిర్మాతలు' అనే విభాగంలో ఈ ఇద్దరి స్టాంపులు కూడా ఉన్నాయి. అయితే కేంద్రం కొత్తగా ఈ స్టాంపుల విభాగాన్నే రద్దు చేసి.. దాన్ని 'భారతీయ రూపశిల్పులు' అనే విభాగంగా మార్చింది. అందువల్ల ఇందిరా - రాజీవ్ స్టాంపులు తీసేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇందులో నెహ్రూ - గాంధీ - మదర్ థెరిసా వంటి వారిని ఉంచారు. ఈ విభాగంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ నుంచి - వివేకానంద - రాణాప్రతాప్ - నేతాజీ - వల్లభాయ్ పటేల్ తదితర అనేకమంది ఉన్నారు. వీరితో పాటూ రవీంద్రనాధ్ టాగూర్ - శ్రీనివాసరామానుజన్ - సుబ్రహ్మణ్యభారతి - ఎంఎస్ సుబ్బులక్ష్మి - బిస్మిల్లాఖాన్ తదితరుల కొత్త స్టాంపులు కూడా తేనున్నారు. ఇంతమంది ఉంటుండగా.. ఆ వర్గంలోంచి ఇందిరాగాంధీ - రాజీవ్‌గాంధీ పోస్టల్ స్టాంపులను తొలగించడం అనేది ఏదో కక్షపూరితంగా చేసిన దుష్టనిర్ణయం లాగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది మోడీ సర్కార్ దిగజారుడుతనం అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 'ఇందిరాగాంధీ రాజ్ భాషా పురస్కార్' - 'రాజీవ్ గాంధీ రాష్ట్రీయ గ్యాన్ విజ్ఞాన్ పుస్తక్ లేఖన్ పురస్కార్' లనుంచి వారి పేర్లను కూడా తొలగించారని.. ఇప్పుడు మళ్లీ ఇలాంటి తప్పిదం చేస్తున్నారని.. కాంగ్రెస్ అంటోంది. ఏదేమైనా.. ఇలాంటి చిల్లర నిర్ణయాల వల్ల చికాకులు తప్ప ప్రభుత్వం ప్రజల సంక్షేమం దిశగా సాధించేది ఏమైనా ఉంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.