ఏపీ రాజధాని ఏదీ అంటే ఈ రోజుకీ ఎవరికీ చెప్పలేని పరిస్థితి. అసలే ఉమ్మడి మద్రాస్, ఉమ్మడి ఏపీ నుంచి విడివడి నానా అవమానాలు పడుతూ 2014 నాటికి విభజిత ఏపీగా ఉన్న చోట ఒక రాజధాని అవసరం అయితే ఎంతగానో ఉంది. దాని వల్ల ఎవరు బాగుపడతారు, ఎవరు బావుకుంటారు అన్నది పక్కన పెడితే ఏపీకి కూడా ఒక దర్జా కావాలా వద్దా, ఏపీకి కూడా ఒక గుర్తింపు కావాలా వద్దా.
సరిగ్గా ఇదే విషయం ఇపుడు కేంద్రానికి కూడా గుర్తుకు వచ్చినట్లుంది. అమరావతి రాజధానికి తాజా బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఒక విధంగా ఏపీ జనాలకు ఊరట. అమరావతికి అతి పెద్ద ఊపిరి. అదే సమయంలో మూడు రాజధానుల అజెండా ముందుకు తెచ్చి ఎక్కడా అభివృద్ధి అంటూ లేకుండా చేసిన పాలకులకు మాత్రం షాకింగ్ లాంటి డెసిషన్.
ఇక్కడ మంచి టైమింగ్ కూడా ఉంది. తొందరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుని మరోమారు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకుని విశాఖకు పాలనను తరలించాలని భావిస్తున్న వైసీపీ పెద్దల ఎత్తులను ముందే పసిగట్టి చిత్తు చేసే వ్యూహాన్ని కేంద్రం పన్నిందా అన్నది కూడా చర్చగా ఉంది.
రాజధాని నిర్మాణం కోసం విభజన చట్టంలో పేర్కొన్న సాయం మేరకు అమరావతికి నిధులను కేటాయిస్తూ కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలీ అంటే అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కేంద్రం గుర్తించిందని అంటున్నారు. దాంతో ఈ నిర్ణయం రాజకీయంగా కూడా వేడిగా వాడిగా చర్చ జరిగేలా ఉంది. అదే సమయంలో 2022-23లో అమరావతి రాజధానికి ప్రావిజన్ ఇచ్చి మరీ నిధులను కేంద్రం కేటాయించడాన్ని ప్రత్యేకతగానే చూడాలి మరి.
ఈ నిధులతో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం ఎంతెంత నిధులను ఇస్తున్నారో కూడా పక్కాగా తెలియచేయడం విశేషం. అలాగే ఈ నిధులను ఏ వైపునకూ మళ్ళించకుండా కేవలం అమరావతి రాజధానికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కేటాయింపులు చూస్తే చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయని చెప్పాలి. ఇందులో సచివాలయ నిర్మాణం కోసం 1,224 కోట్ల రూపాయలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ళ నిర్మాణం కోసం 1,123 కోట్లు, జీపీ వో ఏకు భూ సేకరణ కోసం 6.69 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణించింది.
ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే సచివాలయం కోసం నిధులను ఖర్చు చేయాలని కేంద్రం విడుదల చేస్తోంది. కానీ పాలనా రాజధాని పేరిట విశాఖకు సచివాలయాన్ని తీసుకెళ్ళాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ నిధులను కేంద్రం చెప్పినట్లే తుచ తప్పకుండా ఖర్చు చేస్తారా లేక ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తారా అన్నది చూడాలి.
మరో విషయం కూడా చూస్తే ఏపీలో అమరావతిని మూడుగా చేస్తామని ఏపీ సర్కార్ అన్నపుడు గతంలో కేంద్రం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో రాజధాని అన్నది రాష్ట్రం ఇష్టమని పేర్కొంది. మరిపుడు చూస్తూంటే కేంద్రం అమరావతికి నిధులు కేటాయించి ఖర్చు చేయండని దాదాపుగా ఆదేశించినంతగా చేయడం అంటే కేంద్ర వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చిందనే అంటున్నారు. దీంతో వైసీపీ సర్కార్ ఏం చేస్తుంది. తన మూడు రాజధానుల ఆలోచనను విరమించుకుంటుందా లేక దూకుడుగా ముందుకు సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.