నిద్ర లేచిన వెంటనే చేతిలో పట్టుకునే బ్రష్.. పేస్ట్ మొదలు రాత్రి పడుకునే ముందు వరకూ వాడే ప్రతి వస్తువుకు.. సేవకు ఎంతోకొంత పన్ను చెల్లించాల్సిందే. పన్ను చెల్లించని పక్షంలో సేవలు అందే అవకాశమే లేదు. ప్రతి విషయంలోనూ.. పన్నుపోటు తప్పనిసరిగా మారిపోయింది. ఇంటి పన్ను మొదలు.. ఆదాయపన్ను వరకూ నిత్యం ఏదో కోణంలో ఏదో విషయంలో పన్ను మాట వినకుండా ఉండని పరిస్థితి.
ఇదెంత దారుణంగా మారిందంటే.. ఆకలేసి హోటల్ కి వెళ్లి కాసింత తిండి తింటే ఖర్చు చేసే ప్రతి పది రూపాయిలకు దాదాపు 2 రూపాయిల వరకూ పన్నులు సేవల కింద ఖర్చు చేయాలి. ఇక.. టిఫిన్ కోసం వాడే వస్తువులకు పడిన పన్నును కలిపితే ఈ మొత్తం 4 రూపాయిల వరకూ వెళ్లే దుస్థితి. అంటే.. పది రూపాయిల టిఫిన్ కు నాలుగు రూపాయిలు పన్నే కట్టాలన్న మాట. బతికేందుకు అవసరమైన తిండి మీద కూడా ఇంత పన్నుపోటు ఏమిటో అర్థం కాదు.
తాజాగా కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యను విన్నప్పుడు చాలానే ఆలోచనలు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఒక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు చెల్లిస్తున్న పన్ను మొత్తం ఎంతో తెలుసా? ఈ ప్రశ్నకు చాలామంది నోటి నుంచి నో అన్న సమాధానమే వస్తుంది. నిజానికి మనం నివసించే ప్రాంతంలో ఉండే స్థానిక ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. పనిలో పనిగా కేంద్రప్రభుత్వం వరకూ చాలానే పన్నులు వడ్డిస్తుంది. ఇప్పుడు చెప్పేది కేవలం కేంద్రం పిండే పన్నుల మొత్తాన్నే. ఈ అంకెను చూస్తే.. దేశ ప్రజల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందే మొత్తం ఇంత భారీ మొత్తమా? అని గుడ్లు తేలయక మానదు.
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. దేశ వ్యాప్తంగా ప్రజలు చెల్లించే మొత్తం పన్ను విలువ కాస్త అటూఇటూగా 15లక్షల కోట్ల రూపాయిల వరకూ ఉంటుందని తేల్చారు. తాజాగా ఈ ఏడాది జనవరి 31 నాటికి ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.5.54లక్షల కోట్లు.. పరోక్ష పన్నుల ద్వారా రూ.5.69 లక్షల కోట్లు వసూలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.7.52లక్షల కోట్లు.. పరోక్ష పన్నుల ద్వారా రూ.7.03లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉన్నట్లు కేంద్రమంత్రి జయంత్ సిన్హా చెబుతున్నారు. ఇంత భారీ మొత్తం దేశానికి అందుతున్నా.. ఆ మొత్తం తిరిగి దేశ ప్రజల సంక్షేమం కోసం ఎంత వినియోగిస్తున్నారో మనం రోజూ చూస్తున్నదే. కేంద్రం పిండేసే మొత్తమే ఇంత ఉంటే.. రాష్ట్ర.. స్థానిక సంస్థలకు చెల్లించే పన్ను లెక్క కలిపితే ఎంత పెద్ద మొత్తం అవుతుందో..? ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత మనసులో అనిపించే మాట ఒక్కటే.. బతికేది పన్నులు కట్టేందుకేనా? అని. కాదంటారా?