పోర్టుల ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు?

Update: 2021-03-03 16:30 GMT
కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేయబోతున్నట్టు తెలిసింది.. ఇప్పటికే  దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు దేశంలోని పోర్టులను కూడా ప్రైవేటీకరించేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.  

తాజాగా జరిగిన మ్యారిటైమ్ సదస్సులో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించబోతున్నట్లు ప్రకటించారు. వీటి ఆధ్వర్యంలో నడుస్తున్న 39 బెర్తులను 2024 ఏడాది చివరికల్లా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కుదుర్చుకోనున్నట్లు మోడీ స్పష్టం చేశారు.

పోర్టుల ప్రైవేటీకరణ కోసం కేంద్రం తొందరలోనే ప్రైవేటు పోర్టుల అథారిటీ చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తోంది.   దేశంలోని అనేక పోర్టులను ప్రైవేటీకరిస్తే.. అందులో ఏపీలోని అతిపెద్ద పోర్టు అయిన విశాఖ పోర్టు కూడా ఉండొచ్చన ప్రచారం సాగుతోంది. విశాఖ పోర్టు ఉంటుందో ఉండదో కానీ.. ప్రైవేటు పోర్టుల ప్రైవేటీకరణ అనే సరికి ఈ పరిణామం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించిన కేంద్ర ప్రభుత్వం  విశాఖ పోర్టును కనుక ఒకవేళ ప్రైవేటీకరిస్తే మరింత దుమారం రేగడం ఖాయం.  దేశంలోని పోర్టుల ప్రైవేటీకరణలో విశాఖ పోర్టు ఉండకూడదనే ఏపీలోని ప్రజలు, పార్టీలు కోరుకుంటున్నాయి. ఏం జరుగుతుందనేది భవిష్యత్తులో తేలనుంది.
Tags:    

Similar News